CBSE: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు నేడు..
దిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. జులై 31 నాటికి సీబీఎస్‌ఈ ఫలితాలను ప్రటించాలని భావిస్తున్నట్లు గత నెల కేంద్రం సుప్రీంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి.
విద్యార్థులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్(cbseresults.nic.in)ను వీక్షించవచ్చు. దాంతోపాటు digilocker.gov.in, డిజిలాకర్ యాప్‌లో ఫలితాలను చూసుకునే వీలుంది. అందుకోసం విద్యార్థులు రోల్‌నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.
99.37శాతం విద్యార్థులు పాస్
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పరీక్షలు రద్దుచేయడంతో మెరిట్ లిస్ట్‌ను ప్రకటించలేదు. DigiLockerలో స్కోర్ కార్డును పొందవచ్చు. ఈ ఏడాది 13,04,561 మంది ఫలితాలను బోర్డు వెల్లడించగా.. రికార్డు స్థాయిలో 99.37శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు సీబీఎస్‌ఈ ప్రకటించింది. అలాగే, దిల్లీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 99.84శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపింది. మొత్తంగా 70,004మంది విద్యార్థులు 95శాతం మార్కులు సాధించగా.. 1,50,152మంది విద్యార్థులు 90శాతం పైగా మార్కులు సాధించినట్టు బోర్డు వెల్లడించింది. ఇకపోతే, కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), సీటీఎస్‌ఏ పాఠశాలల్లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొంది. ఇంకా 65184 మంది విద్యార్థుల ఫలితాలు వెయింటింగ్‌లో ఉన్నాయని, వారి ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్టు సీబీఎస్‌ఈ అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం 10.59శాతం పెరిగినట్టు తెలిపారు.
Thanks for reading CBSE: CBSE Class 12 results today ..
No comments:
Post a Comment