Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 20, 2021

Flipkart: Offers on ‘Big Saving Days’


 Flipkart: ‘బిగ్‌ సేవింగ్‌ డేస్‌’లో ఆఫర్లివే!

 ప్రముఖ ఆన్‌లైన్‌ వస్తు విక్రయ వేదిక ‘ఫ్లిఫ్‌కార్ట్‌’ జులై 25 నుంచి 29వ తేదీ వరకూ ‘బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌’ సేల్స్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులు ఒకరోజు ముందుగానే అంటే జులై 24 నుంచే ఈ డీల్స్‌ను పొందే అవకాశం ఉంది.


రియల్‌ మి, పోకో, వీవో, మోటోరోలా తదితర మొబైల్‌ ఫోన్లతో పాటు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై రాయితీలు లభించనున్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారు 10శాతం తక్షణ రాయితీని పొందే అవకాశం ఉంది. బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌లో భాగంగా రియల్‌మి సీ20 రూ.500 తగ్గి రూ.6,499కే లభించనుంది. ఇక రూ.18,999 విలువైన పోకో ఎక్స్‌3 ప్రో రూ.17,249... రూ.19,999 ధర ఉన్న రియల్‌ మి ఎక్స్‌7 5జీ ఫోన్‌ రూ.18,999... మోటో జీ40 రూ.13,499(అసలు ధర రూ.14,999)లకే లభించనుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌62 ధరను కూడా తగ్గించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. అయితే, ఎంత డిస్కౌంట్‌ వస్తుందనే మాత్రం చెప్పలేదు.


ఐఫోన్‌ ఎస్‌ఈ2020 మోడల్‌ రూ.28,999(అసలు ధర రూ.39,900), ఐఫోన్‌ ఎక్స్‌ ఆర్‌ రూ.37,999(అసలు ధర రూ.47,900), ఐఫోన్‌ 12 రూ.67,999(అసలు ధర రూ.79,900)లకే లభించనున్నాయి. వీటితో పాటు పలు టెలివిజన్‌లు 65శాతం వరకూ తగ్గింపుతో లభించనున్నాయి. అంతేకాదు, వివిధ ఉత్పత్తులను వడ్డీ రహిత వాయిదాల్లో పొందవచ్చు. ఎల్‌జీ, శాంసంగ్‌, వర్ల్‌ఫూల్‌ ఏసీలు రూ.23,490 నుంచి ప్రారంభంకానున్నాయి.

Thanks for reading Flipkart: Offers on ‘Big Saving Days’

No comments:

Post a Comment