Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 25, 2021

Home Loan: Are you buying a new house ... but these are the benefits of taking a loan in the name of your wife ..


 Home Loan : కొత్త ఇల్లు కొంటున్నారా ... అయితే భార్య పేరిట లోన్ తీసుకుంటే ఇవీ లాభాలు ..

సొంతింటి కలను నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా సొంతింటి కోరిక పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. అయితే, చాలీచాలని జీతాలు, అందుబాటులో లేని ఇళ్ల ధరలతో చాలా మందికి ఇది కలగానే మిగిలిపోతుంది. అయితే, ఉన్నంతలో పొదుపు చేసుకుంటూ, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే సొంతింటి కల నెరువేర్చుకోవడం కష్టమేమీ కాదు. అనేక, బ్యాంకులు ఇటువంటి వారి కోసమే రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే, ఈ రుణాలను తీసుకునే సమయంలో సరైన ప్రణాళికతో ముందడుగు వేయాలి.

తద్వారా వడ్డీ భారం తగ్గించుకోవడంతో పాటు, ఆయా బ్యాంకులు అందజేసే బోనస్​ పాయింట్లు, ఆఫర్లను సైతం సొంతం చేసుకోవచ్చు. హోమ్​ లోన్​ తీసుకునే సమయంలో ప్రతి ఒక్కరు చాలా తెలివిగా వ్యవహరించాలి. వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఇల్లు కొనేటప్పుడు, హోమ్ లోన్​ తీసుకునే సమయంలో మీ జీవిత భాగస్వామిని సహ యజమానిగా చేర్చడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని గుర్తించుకోండి.

ఎందుకంటే, మహిళలను ప్రోత్సహించడానికి, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి అనేక బ్యాంకులు అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. వారి కోసమే ప్రత్యేకంగా పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇటు, ప్రభుత్వం కూడా అనేక రాయితీలు కల్పించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తోంది. అందువల్ల, బ్యాంకులు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బిఎఫ్‌సి) ద్వారా తీసుకునే హోమ్​ లోన్లపై మహిళలు ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.

వడ్డీరేటు తగ్గింపు : ముఖ్యంగా, మహిళలు తీసుకునే రుణాలపై ప్రభుత్వాలు వివిధ రాయితీలను అందిస్తాయి. తద్వారా మీపై వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంకులు సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలకు 50 నుంచి 100 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీ రేటుకే రుణాలను అందిస్తున్నాయి. ఫలితంగా మహిళలకు నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుంది. మహిళలు తీసుకునే హోమ్​లోన్​పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కేవలం 6.80 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తోంది. అదే, పురుషుల విషయంతలో 7% వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ఇది తక్కువ వ్యత్యాసం అనిపించినప్పటికీ దీర్ఘకాలికంగా మీపై వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది.

స్టాంప్​ డ్యూటీ తగ్గింపు: దీనితో పాటు మహిళా కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫీజు వంటి వాటిపై రాయితీ లభిస్తుంది. సాధారణంగా అన్ని రాష్ట్రాలు పురుషుల నుండి 6 శాతం, మహిళల నుండి 4 శాతం మేర స్టాంప్​ డ్యూటీ వసూలు చేస్తాయి. అయితే, ఢిల్లీ, పంజాబ్​, హర్యానా, ఉత్తరప్రదేశ్​​, రాజస్థాన్, మహారాష్ట్ర​ వంటి రాష్ట్రాలు మహిళలకు స్టాంప్​ డ్యూటీలో మరో 1 నుండి 2 శాతం వరకు రాయితీని అందిస్తున్నాయి. అందువల్ల మీ ఇంటికి భార్యను సహ యజమానిగా చేర్చడం ద్వారా స్టాంప్​ డ్యూటీ తగ్గించుకోవచ్చని గుర్తించుకోండి.

టాక్స్​ బెనిఫిట్స్​: భార్యను సహయజమానిగా చేర్చడం ద్వారా హోమ్​లోన్​ ఎలిజిబిలిటి, డబుల్​ టాక్స్​ బెనిఫిట్స్​, సులభంగా వారసత్వ బదిలీ వంటి మూడు ప్రయోజనాలను పొందవచ్చు. టాక్స్​ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. దీని కింద అసలుపై గరిష్టంగా రూ.1.5 లక్షలు, వడ్డీ​ రీపేమెంట్​పై రూ .2 లక్షలు, భార్యాభర్తలిద్దరూ ప్రత్యేక ఆదాయ వనరులు కలిగి ఉంటే రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80 సి, సెక్షన్ 24, సెక్షన్లు 80 ఈఈ, 80 ఈఈఎ కింద వారి ఆదాయాలపై పన్ను మినహాయింపులు పొందడానికి ఇద్దరూ అర్హులే. వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద అదనపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

Thanks for reading Home Loan: Are you buying a new house ... but these are the benefits of taking a loan in the name of your wife ..

No comments:

Post a Comment