Railway Jobs 2021 : రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు ... ఖాళీల వివరాలు ఇవే
పలు ఖాళీల భర్తీకి భారతీయ రైల్వే మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేషన్ మాస్టర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు వెస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC (గ్రాడ్యుయేట్) పోస్టుల్ని భర్తీ చేయనుంది పశ్చిమ మధ్య రైల్వే. అంటే ప్రస్తుతం రైల్వేలో ఉద్యోగులుగా ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 25 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు.
West Central Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మొత్తం స్టేషన్ మాస్టర్ పోస్టుల సంఖ్య- 38
దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 25
విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అర్హులు కాదు.
వయస్సు- 2021 జూలై 1 నాటికి జనరల్ అభ్యర్థులకు 40 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 43 ఏళ్లు.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్.
West Central Railway Recruitment 2021: అప్లై చేయండి ఇలా
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
About us లో Recruitment సెక్షన్ పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీలో Railway Recruitment Cell పైన క్లిక్ చేయాలి.
GDCE Notification No. 01/2021 పైన క్లిక్ చేయాలి.
Click Here for Link పైన క్లిక్ చేస్తే దరఖాస్తు విండో ఓపెన్ అవుతుంది.
అందులో New Registration పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.
ఆ తర్వాత ఎంప్లాయ్‌మెంట్ కోడ్ లేదా పీఎఫ్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత పుట్టిన తేదీ, క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి.
Continue పైన క్లిక్ చేసి మిగతా దరఖాస్తు పూర్తి చేయాలి.
ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
మొబైల్ నెంబర్, ఇమెయిల్‌కు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వస్తుంది.
ఆ వివరాలతో లాగిన్ కావాలి.
ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్ అఫ్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Thanks for reading Railway Jobs 2021: Railway Station MasterJobs ... Here are the details of the vacancies
No comments:
Post a Comment