School Education – SSC Public examinations during the year 2020-21-Non-Furnishing of FA 1 and FA 2 in CCE portal of certain schools in the state-Instructions issued
★ 2020-21 విద్యా సంవత్సరమునకు సంబంధించి 10 వ తరగతి విద్యార్థుల FA 1 & FA 2 మార్కులను CSE పోర్టల్ నందు నిర్ణీత సమయంలో నమోదు చేయవలసిందిగా పలుమార్లు కోరినప్పటికీ, కొన్ని పాఠశాలలు వానిని నమోదు చేయలేదు.
★ అందరు DEOలు ఆయా మండలాలలో ముగ్గురు సభ్యులతో (సంబంధిత MEO మరియు ఇరువురు ఉన్నత పాఠశాలల HM లు) ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా FA 1& FA 2 మార్కులు ఇంకనూ నమోదు చేయని పాఠశాలలను సందర్శింపజేసి..... ఆ పాఠశాలల్లో జవాబు పత్రాలను, వాని మూల్యాంకనాన్ని, మార్కుల రిజిస్టర్ లను తనిఖీ చేసి ధ్రువీకరించి సదరు మార్కులను ఆ కమిటీ సంబంధిత DEO లకు సమర్పించేలా చూడాలి.
★ పైన పేర్కొనబడిన రికార్డులన్నీ సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయా పాఠశాలల HM లను మార్కులు CSE పోర్టల్ లో నమోదు చేయుటకు (DEO లాగిన్ నందు) అనుమతిస్తారు.
★ ఈ ప్రక్రియ అంతా ది.18.07.2021 నాటికి తప్పనిసరిగా పూర్తి కావలెను
★ ఇప్పటికే నమోదు చేయబడిన మార్కులను సవరించుటకు ఎట్టి పరిస్థితులలోనూ అవకాశం లేదు
★ ఈ మేరకు DSE AP వారు అందరు DEO లను కోరుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు.
Thanks for reading School Education – SSC Public examinations during the year 2020-21-Non-Furnishing of FA 1 and FA 2 in CCE portal of certain schools in the state-Instructions issued
No comments:
Post a Comment