7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ... పెన్షన్ భారీగా పెంపు
1. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ లిమిట్ గరిష్టంగా రూ.45,000 మాత్రమే ఉండేది. కానీ ఫ్యామిలీ పెన్షన్‌ను భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం.ఏకంగా రూ.1,25,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఏడో పే కమిషన్ సిఫార్సుల మేరకు పెన్షన్‌ను పెంచింది కేంద్ర ప్రభుత్వం.
2. సెంట్రల్ సివిల్ సర్వీసెస్-CCS పెన్షన్, 1972 రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వామి పెన్షన్ పొందొచ్చు. వారి పిల్లలకు కూడా పెన్షన్ లభిస్తుంది. అయితే ఇందుకోసం కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.
3. ఫ్యామిలీ పెన్షన్ గరిష్టంగా రూ.1,25,000 వరకు లభిస్తుంది. ఫ్యామిలీ పెన్షన్ లిమిట్‌ను రూ.45,000 నుంచి రూ.1,25,000 వరకు పెంచడం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
4. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ రూల్స్‌పై ఇటీవల డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వివరణ ఇచ్చిందని, గరిష్టంగా రూ.1,25,000 వరకు పెన్షన్ పొందొచ్చని, గతంతో పోలిస్తే ఈ పెన్షన్ రెండున్నర రెట్లు ఎక్కువని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
5. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలు కూడా ఉన్నాయి. పదవీ విరమణ పొందిన ఉద్యోగి కుటుంబ సభ్యులు కూడా పెన్షన్ పొందేందుకు అర్హులు.
6. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్‌ఫేర్ నియమనిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారికి 25 ఏళ్ల లోపు పెళ్లి కాని కొడుకులు ఉంటే పెన్షన్ పొందొచ్చు.
7. పెళ్లికాని కూతుళ్లు, విడాకులు తీసుకున్న కూతుళ్లు, వితంతువులైన కూతుళ్లకు కూడా పెన్షన్ వస్తుంది. వారికి వయస్సు పరిమితి లేదు. ఇక మానసిక, శారీరక వికలాంగులైన పిల్లలకు కూడా పెన్షన్ వర్తిస్తుంది. అయితే వారికి ఎలాంటి జీవనాధారం లేకపోతేనే పెన్షన్ వర్తిస్తుంది.
8. మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్‌పై ఆధారపడిన తల్లిదండ్రులు, తోబుట్టువులకు కూడా పెన్షన్ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ వేతనంలో 50 శాతం పెన్షన్ రూపంలో వస్తుంది. ప్రస్తుతం ఏడో పే కమిషన్ ద్వారా గరిష్ట బేసిక్ వేతనం రూ.2,50,000 ఉంది.
9. అంటే ఉద్యోగులకు రిటైర్ అయిన తర్వాత గరిష్ట పెన్షన్ రూ.1,25,000 లభిస్తుంది. ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు నియమనిబంధనల మేరకు గరిష్టంగా రూ.1,25,000 వరకు పెన్షన్ పొందొచ్చు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆరు నెలలకు ఓసారి ప్రకటించి డియర్‌నెస్ రిలీఫ్ కూడా వర్తిస్తుంది.
10. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం రూ.9,000 పెన్షన్ + డియర్‌నెస్ రిలీఫ్ లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అవసరం. మరణించిన పెన్షనర్, వారి జీవిత భాగస్వామికి కలిపి జాయింట్ అకౌంట్ ఉండాలి.
11. ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు ఇవ్వాలి. పెన్షనర్ డెత్ సర్టిఫికెట్ జత చేయాలి. దరఖాస్తు దారుల పుట్టిన తేదీ, వయస్సు ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఫ్యామిలీ పెన్షన్ కోసం పెన్షనర్ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు ఫామ్ 14 లో బ్యాంకుకు వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు.
Thanks for reading 7th Pay Commission: Good news for central government employees .
No comments:
Post a Comment