Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, August 11, 2021

Apple health benefits: Why eat apple a day?


 Apple health benefits : రోజుకో యాపిల్ ఎందుకు తినాలి ?



రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదన్నది పరిశోధకుల మాట. ప్రతి రోజూ ఓ యాపిల్ తినడం కుదరకపోవచ్చు. కానీ వీలైనప్పుడల్లా, వారానికి కనీసం నాలుగు యాపిల్సైనా తింటే ఎన్నో రకాల ప్రయోజనాల్ని పొందవచ్చు. ముఖ్యంగా కేన్సర్ లాంటి రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

యాపిల్‌ మెదడును చురుగ్గా మార్చేస్తుంది.మతిమరపుకి కారణమయ్యే అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తూ, మెదడుకి రక్షణనిస్తుంది. అంతేకాదు నరాలపై ప్రభావం చూపే, పార్కిన్‌సన్స్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.

కంటి చూపును కాపాడుతుంది. కాటరాక్ట్స్, గ్లకోమా వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరచి, రేచీకటి రాకుండా చేస్తుంది. ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ ఫైటోన్యూట్రియంట్స్ సూక్ష్మజీవుల నుంచీ కళ్ల హాని జరగకుండా కాపాడతాయి.

యాపిల్‌లో విటమిన్‌-సి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధకశక్తిని మరింత పెంచుతుంది. తద్వారా ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

యాపిల్‌లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ ఎన్నో రకాల కేన్సర్ల నుంచి మనల్ని కాపాడతాయి. మిగతా పండ్లతో పోల్చితే పాంక్రియాస్‌ కేన్సర్‌ ముప్పు నుంచి రక్షణ కల్పించే గుణం యాపిల్‌లో 23 శాతం ఎక్కువ అని అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ పరిశోధనల్లో తేలింది.

దీనిలో ట్రైటెర్పినాయిడ్స్‌ అనే పోషకాలు... కాలేయ కేన్సర్, పెద్ద పేగు కేన్సర్, రొమ్ము కేన్సర్‌లను నివారిస్తాయని కార్నెల్‌ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో తేలింది.

యాపిల్‌లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. అందువల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగయ్యి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాపిల్‌ మంచి డీ-టాక్సిఫైయింగ్‌ ఏజెంట్‌ కూడా. ఇది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన కాలేయంలోని విషాల్ని విజయవంతంగా తొలగిస్తుంది.

యాపిల్ త్వరగా ముసలితనం రాకుండా కాపాడుతుంది. ఇందులోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ మన చర్మ కణాల్ని కాపాడతాయి. ముడతలు, మచ్చల వంటివి రాకుండా చేస్తాయి. చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారేలా యాపిల్ చేస్తుంది. మృత కణాల్ని తొలగించడమే కాదు. పాడైన కణాల్ని సరిచేస్తుంది కూడా. ఈ గుజ్జులో తేనెను కలిపి చర్మానికి పట్టిస్తే, యవ్వన ఛాయలతో మెరిసే స్కిన్ పొందొచ్చు , ఇందులోని పీచు అధిక బరువును తగ్గించేందుకు తోడ్పడుతుంది.

యాపిల్‌లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. అందువల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగయ్యి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాపిల్‌ మంచి డీ-టాక్సిఫైయింగ్‌ ఏజెంట్‌ కూడా. ఇది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన కాలేయంలోని విషాల్ని విజయవంతంగా తొలగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదంటున్నారు పరిశోధకులు. ఇవి మనకు ఏడాదంతా దొరుకుతాయి కాబట్టి, ప్రణాళికా బద్ధంకా తింటూ ఉంటే, మనకు తెలియకుండానే చాలా రకాల రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

Thanks for reading Apple health benefits: Why eat apple a day?

No comments:

Post a Comment