Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, August 14, 2021

Dangerous Food: 99% of people make these mistakes while eating food


 Dangerous Food : 99 శాతం మంది ఆహారం తినేటప్పుడు ఈ తప్పులు చేస్తారు .. వెంటనే పద్ధతి మార్చుకోండి .. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు .. !

Dangerous Food: ఆహారం తీసుకోకుండా ఏ మనిషీ బతకలేడు. మనిషే కాదు.. ఏ జీవి కూడా ఆహారం లేకుండా ఎక్కువ రోజులు బ్రతికి ఉండలేదు. అయితే, మనం తీసుకునే ఆహారం కూడా మనం బ్రతికి ఉండాలా? భారీ మూల్యం చెల్లించుకోవాలా? అని డిసైడ్ చేస్తుందట. ఇష్టారీతిని ఏది పడితే అది తింటే చివరికి అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకునే విషయంలో దాదాపు 99 శాతం మంది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే చేస్తున్నారు. ఇలా తప్పులు చేసేవారు.. తమ అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు. మరి ఇంతకీ ఏం మార్చుకోవాలి? ఏం తినడకూడదు? ఏం తినాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


1. వేసవి కాలంలో బెండకాయలు, కాకర కాయలు మార్కెట్‌లో లభిస్తాయి.కొంతమందికి ఈ రెండు కూరగాయలంటే ఇష్టం. అయితే.. బెండకాయను, కాకర కాయను ఎప్పుడూ కలిపి తినకూడదు. ఈ రెండూ కలిపి తినడం వల్ల శరీరంలో విషం తయారవుతుంది. అది ప్రాణాంతకంగా పరిస్థితిని కలిగిస్తుంది.


2. పెరుగుతో ఉల్లిపాయను కలపడం మంచిది కాదు. వాటిని తినడం మానుకోవాలి. లేకపోతే రింగ్‌వార్మ్, గజ్జి, దురద, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు, చర్మం, పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు సంభవించవచ్చు.


3. ఒకవేళ మీరు పప్పు తిన్నట్లయితే, ఆ తరువాత ఎప్పుడూ పాలు తాగొద్దు. అలాగే.. ముల్లంగి, గుడ్డు, మాంసం తిన్న తర్వాత కూడా పాలు తాగకూడదు. అలా చేస్తే జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఈ పదార్థాలు తిన్న కాసేపటి తరువాత పాలు తాగితే ప్రయోజనం ఉంటుంది.


4. ముల్లంగిని ఆహారంలో సలాడ్‌గా తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ మీరు బెండకాయను తింటున్నట్లయితే.. ముల్లంగిని ఎప్పుడూ తినొద్దు. ముల్లంగి, బెండకాయ కలిపి తినడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీని కారణంగా ముఖంపై మచ్చలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు తలెత్తేందుకు ఆస్కారం ఉంది.


5. పాలలో పండ్లను కలిపి షేక్స్ చేస్తాము. కస్టర్డ్‌లో కూడా పాలను కలిపి తిసుకుంటారు. కానీ పండ్లను పాలతో కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పాలతో కలిపిన పండ్లను తినడం ద్వారా, పాలలో ఉండే కాల్షియం పండ్ల ఎంజైమ్‌లను గ్రహిస్తుంది. దీని కారణంగా శరీరానికి పండ్ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Thanks for reading Dangerous Food: 99% of people make these mistakes while eating food

No comments:

Post a Comment