కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతుంటారా ... ప్రమాదమే !
మీరు గమనించే ఉంటారు... కొంత మంది కూర్చున్నప్పుడు తమ రెండు కాళ్లను అదే పనిగా ఊపుతూ ఉంటారు. కొంతమంది చిన్నగా ఊపితే... మరికొంతమంది వేగంగా, పెద్దగా ఊపుతుంటారు. చూడ్డానికి ఏదో సంతోషంలో ఊపుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి దాని వెనక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తోంది.ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు ఇలా సందర్భం ఏదైనా కూర్చున్నప్పుడు కొంతమంది తమకు తెలియకుండానే కాళ్లు ఊపుతూ ఉంటారు.ఇందుకు ప్రధాన కారణం టెన్షన్, ఒత్తిడి, ఆదుర్తా, కంగారు అని పరిశోధనల్లో తేలింది.
మన శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఈ అలవాటు మొదలవుతుంది. అందువల్లే కొంత మంది కూర్చున్నప్పుడు కాళ్లు కదుపుతూ ఉంటారు. అలా కదుపుతున్నప్పుడు కాళ్లు ఓసారి దగ్గరకు వస్తూ, ఓసారి దూరం వెళ్తూ ఉంటాయి.
సరిపడా నిద్ర లేనప్పుడు కూడా ఈ సమస్య మొదలవుతుంది. అంతేకాదు.. శరీరంలో హార్మోన్లు తగిన బ్యాలెన్స్‌లో లేనప్పుడు కూడా ఈ సమస్య మొదలవుతుంది. ఆటోమేటిక్‌గా కాళ్లు ఊగిపోతుంటాయి.
సరిగా నిద్ర పట్టని వాళ్లు... ఆ తర్వాత ఏదైనా పనిలో ఉన్నప్పుడు నిద్ర వస్తుంటే... దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలా కాళ్లు ఊపుతారు. నిద్ర కంట్రోల్ అవుతుంది కానీ... ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.
మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి అంటే... ధ్యానం (Meditation), యోగా (Yoga) వంటివి చెయ్యండి, రోజుకు కనీసం 6 గంటలైనా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం వంటివి చేయవచ్చు. ఇంత చేసినా ఈ అలవాటు పోకపోతే... ఐరన్ టాబ్లెట్లు వాడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అవి వాడితే తప్పనిసరిగా ఈ సమస్య పోతుందని చెబుతున్నారు.
ఐరన్ టాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అనుకునేవారు వాటి బదులుగా అరటిపండ్లు, పాలక్, బీట్ రూట్ వంటివి తినాలి.ఇలా కాళ్లు ఊపేవారు టీ, కాఫీలు ఎక్కువగా తాగుతారు. వాటిని కొంత తగ్గించుకోవడం మేలు. అలాగే రాత్రివేళ మొబైల్‌ని దూరం పెట్టాలి. రాత్రి వేళ నిద్రపోయే సమయానికి టీవీ చూడకూడదు. అప్పుడు ఈ కాళ్లు ఊపే సమస్య కూడా పోతుందని చెబుతున్నారు.
Thanks for reading Do you swing your legs while sitting ... Danger!
No comments:
Post a Comment