Ghee Consumption And Health:: Fear of gaining weight with ghee ... Do you know how many benefits are being lost
●Ghee Health Benefits : నిత్యం నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు .. ఆ రోగాలన్నీ పరార్ .. తెలుసుకోండి
●Ghee Consumption And Health : : నెయ్యితో బరువు పెరుగుతారని భయమా ... ఎన్ని ప్రయోజనాలు కోల్పోతున్నారో తెలుసా
అనేక మంది భోజన ప్రియులు నెయ్యి అంటే పడి చస్తారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకోనిదే ముద్ద ముట్టని వారు కూడా అనేకం. అయితే నెయ్యి రుచి మరియు వాసనను పెంచడమే కాకుండా.. మరెన్నో ప్రయోజనాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే భారతదేశంలో నెయ్యి తినే పద్ధతి యుగయుగాలుగా కొనసాగుతోంది. నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడ్డాయి. క్రమంగా విదేశాలలో ఉన్నవారు కూడా నెయ్యి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని వినియోగిస్తున్నారు.అనేక ప్రయోజనాలు ఉన్న కారణంగా నెయ్యిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు. మీ రోజువారీ ఆహారంలో కొద్దిగా నెయ్యి ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: నెయ్యి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దేశీ నెయ్యిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి మరియు ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది: నెయ్యిని తీసుకుంటే అది మన జీర్ణ శక్తిని పెంచుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది: నెయ్యిలో ఉండే పదార్థాలు ఆలోచనా శక్తిని పెంచుతాయి. ఇది కణాలు మరియు కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తినడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ మెరుగుపడుతుంది, ఇది మన శరీరం యొక్క వైద్యం ప్రక్రియను పెంచుతుంది.
నెయ్యి చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు అందంగా ఉంచుతుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా నెయ్యి కాపాడుతుంది. నెయ్యి శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యి చర్మం మరియు జుట్టుకు ప్రకాశాన్ని తెస్తుంది.
నెయ్యిలో ఉన్న కొవ్వు ఆమ్లాలు దీనిని ఆయుర్వేద సూపర్ ఫుడ్ గా మారుస్తాయి, ఇది శక్తి యొక్క గొప్ప వనరుగా పరిగణించబడుతుంది. అలాగే, నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా, ప్రకాశవంతమైన కంటి చూపు, క్యాన్సర్ నివారణ, మలబద్ధకం నివారణ మరియు మొత్తం ఆరోగ్య మెరుగుదలకు నెయ్యి పని చేస్తుంది.
భారతీయ సాంప్రదాయ వంటకాలలో వినియోగించే పదార్థాలలో నెయ్యిది చాలా ముఖ్యమైన పాత్ర. వంటలకు ప్రత్యేకమైన రుచిని నెయ్యి తీసుకువస్తుంది. కేవలం వంటల్లోనే కాదు.. ఆచారవ్యవహారాల్లో కూడా ఎక్కువగా వాడతారు. దేవుడిని ఆరాధించడానికి ఉపయోగించే పంచామృతంలో నెయ్యి ఓ భాగం. ఆవు నేతితో దీపం వెలిగిస్తారు. హోమాల్లో నెయ్యి వాడతారు. అంతేకాదు ఆయుర్వేదంలో ఎన్నో మందుల తయారీకి నెయ్యి వినియోగిస్తారని తెలిసిందే. నెయ్యిని శుభసూచకంగా విద్యార్థులు గురుదక్షిణ ఇచ్చేవారని పెద్దలు చెబుతుంటారు.
నెయ్యి గొప్పతనం తెలియచెప్పేందుకు సంస్కృతంలో ఒక మాట ఉంది. "రుణం కృత్వ ఘృతం పిబెత్" అంటే " అప్పు చేసి అయినా నెయ్యి తినాలి అని''.
పాతరోజుల్లో నెయ్యికి అంతగా ప్రాముఖ్యత ఇచ్చారు. గ్లోబలైజేషన్ తర్వాత భారత్ మీద పాశ్చాత్య దేశాల ప్రభావం అధికమై నెయ్యి వల్ల కొవ్వు పెరుగుతుందని భావించడం మొదలుపెట్టారు. నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు, నెయ్యి తింటే అధికంగా కొవ్వు వస్తుంది అనే అభిప్రాయం అందరిలో పెరిగిపోవడంతో వాడకం క్రమంగా తగ్గిపోయింది. బరువు పెంచేదిగా, గుండెకి హాని చేసే పదార్థంగా చూడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆహారానికి దూరంగా ఉంచాల్సిన ఆహార పదార్థాల్లో చాలా మంది నెయ్యిని కూడా చేర్చేశారు. కానీ ఇప్పుడిప్పుడే అభిప్రాయాలు మారుతున్నాయి. ఎన్నో పరిశోధనలు నెయ్యిని సూపర్ ఫుడ్ అంటున్నాయి.
నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
- నెయ్యి జీర్ణశక్తిని పెంచుతుంది
- బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది
- రుచిగా, సంతృప్తిగా ఆహరం తినేలా చేస్తుంది. ఈ రుచికి అలవాటు పడితే జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంటాం. కానీ నెయ్యి ల్యుబ్రికెంట్‌లా పనిచేసి కీళ్లని ఆరోగ్యంగా ఉంచుతుంది.
- చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది
- శరీరంలో ఉన్న చెడు కొవ్వుని తొలగిస్తుంది.
- చాలా వరకూ మన జీవన శైలి వల్ల వచ్చే రోగాలకు కారణం ఒత్తిడి. రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, నిద్ర బాగా పడుతుంది.
- కొవ్వులో మాత్రమే కరిగే A,D,E,K విటమిన్ లు మన శరీరానికి అందేలా చేస్తుంది.
- తెలివితేటలను, జ్ఞాపకశక్తి పెంచుతుంది. ఎందుకంటే మన మెదడు 60 శాతం కొవ్వు పదార్థాలతో తయారై ఉంటుంది. నెయ్యిలో మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
- నాడీ వ్యవస్థని బలంగా పనిచేసేలా చేస్తుంది. వెన్నెముకకి ధృడత్వాన్ని, బలాన్ని ఇస్తుంది. కొవ్వుని తగ్గిస్తుంది.
- మన శరీరంలో ఇన్సులిన్ నిరోధం డయాబెటిస్, PCOD మరియు ఊబకాయం లాంటి రోగాలు వచ్చేలా చేస్తుంది. ఇన్సులిన్ సరిగా ఉండేలా నెయ్యి చేస్తుంది.
- శారీరకంగా,మానసికంగా,ఎమోషనల్ గా, అధ్యాత్మికంగా మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
- పరగడుపునే ఆవు నెయ్యి తాగడం వల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. మెదడుకు కావల్సిన శక్తి అంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- గర్భిణిలైతే నెయ్యిని ప్రతి రోజు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎదిగే పిండానికి కీలక పోషకాలు అందాలంటే నెయ్యి తప్పనిసరి.
నెయ్యి తీసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు, ముడుతలు, మొటిమలు తగ్గిపోతాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలల్లో కొంచెం ఆవు నెయ్యి కలుపుకుని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అలాగే మలబద్ధకంతో బాధపడేవాళ్లకు ఇది చక్కటి పరిష్కారం.
ఒక్కమాటలో చెప్పాలంటే ఆవునెయ్యి తింటే బరువు తక్కువ ఉన్నవారు బరువు పెరుగుతారు, ఎక్కువ బరువు ఉన్నవారు తగ్గుతారు. నెయ్యి తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి, కనుక ఇప్పటికైనా అపోహలు వీడి నేతి రుచిని ఆస్వాదించండి, ఆరోగ్యంగా ఉండండి.
Thanks for reading Ghee Consumption And Health:: Fear of gaining weight with ghee ... Do you know how many benefits are being lost
No comments:
Post a Comment