Gold loans: బంగారు రుణాలపై వడ్డీ.. ఏయే బ్యాంకుల్లో ఎంతెంత?
బంగారం మీద రుణాలు తీసుకునే పద్ధతి పాత కాలం నుంచే ఉంది. పూర్వం ప్రైవేట్ వ్యక్తులు, చిన్న వ్యాపారులు బంగారాన్ని తనఖా కింద పెట్టుకుని రుణాలిచ్చేవారు. బ్యాంకులు తక్కువ స్థాయిలోనే రుణాలిచ్చేవి. కానీ ఇప్పుడు బంగారం తనఖాపై రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు బాగానే ఆసక్తి చూపుతున్నాయి. బంగారం మీద రుణాలు ఇచ్చే పెద్ద సంస్థలు కూడా ఇప్పుడు చాలానే ఉన్నాయి. ఈ రుణాలు బ్యాంకుల్లో 7% వడ్డీ రేటు నుంచి మొదలవుతున్నాయి. బంగారం హామీ ఉంటుంది కాబట్టి తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికీ ఈ రుణాలు సులభంగానే లభిస్తాయి. వ్యక్తిగత రుణాల కన్నా ఈ బంగారు రుణాలకు వడ్డీ రేటు తక్కువ ఉంటుంది. ఇది అత్యంత ప్రాధాన్యం కలిగిన ఫైనాన్సింగ్ సౌకర్యాల్లో ఒకటి. ఈ సెక్యూర్డ్ రుణాలు అత్యవసర సమయంలో రుణదారులను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడమే కాకుండా వారి ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు వెళ్లడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
సాధారణంగా బంగారం రుణాల్లో తాకట్టు పెట్టిన బంగారానికి మార్కెట్ విలువలో 75% వరకు రుణ సంస్థలు రుణాన్ని ఇస్తున్నాయి. బంగారు రుణం ఎంత వస్తుందనేది, వడ్డీ వివరాలు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ ఛార్జీలు, ఆలస్య రుసుములు గురించి వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వెబ్‌సైట్లలో లోన్ తీసుకోవడానికి ముందే వినియోగదారులు చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే రీ పేమెంట్‌లో ఆలస్యం కారణంగా అదనపు జరిమానాలు, విలువైన ఆస్తి (బంగారం)ని కోల్పేయే అవకాశం ఉంది.
కాబట్టి మీరు బంగారు రుణం కోసం చూస్తున్నట్లయితే దేశంలోని కొన్ని ప్రముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చే రుణ వడ్డీ ఆఫర్లు ఇక్కడ ఉన్నాయి. 2 సంవత్సరాల కాల పరిమితికి, 1 లక్ష రూపాయల రుణానికి నెలవారీ ‘ఈఎమ్ఐ కింది టేబుల్‌లో ఉన్నాయి. ఈఎమ్‌ఐ లెక్కింపు కోసం ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను ఇక్కడ ఇవ్వలేదు. మీ రుణ మొత్తాన్ని బట్టి మీకు వర్తించే రేట్లు ఎక్కువగానూ ఉండొచ్చు.
Thanks for reading Gold loans: What is the interest on gold loans?
No comments:
Post a Comment