How to Lock Facebook Profile : ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేయడం ఎలా ?
ఈ జనరేషన్ వాళ్లకు ఫేస్‌బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫేస్‌బుక్ వాడని వాళ్లు లేరు. ఇండియాలో ఫేస్‌బుక్‌కు కోట్లలో యూజర్లు ఉన్నారు.
స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరు తమ చదువుతో సంబంధం లేకుండా ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతూ.. సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటున్నారు.
అయితే.. ఫేస్‌బుక్‌లో చేసే ప్రతి అప్‌డేట్ వల్ల.. ప్రతి పోస్ట్ వల్ల.. యూజర్ల ప్రైవసీకి కొంచెం భంగం వాటిల్లే సమస్య అయితే ఉంది. ఎందుకంటే.. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ లిస్టులో లేనివాళ్లు కూడా వేరే వాళ్ల అకౌంట్‌లోకి వెళ్లి వాళ్ల అప్‌డేట్స్, పోస్టులు.. వాళ్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నీ చూడొచ్చు. ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవాళ్లకు అకౌంట్ సమాచారం కనిపిస్తే ఓకే కానీ.. ఫ్రెండ్ లిస్టులో లేనివాళ్లు తమ అకౌంట్, పోస్టులు ఎందుకు చూపించాలి? ఆ ఆలోచన నుంచి వచ్చే లాక్ ప్రొఫైల్.
ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ లిస్టులో లేనివాళ్లు సదరు అకౌంట్‌ను చూడకుండా ఉంచేదే ప్రొఫైల్ లాక్. యూజర్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకుంటే కేవలం తన ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న యూజర్లు మాత్రమే తన అకౌంట్‌ను చూడగలరు. ఫ్రెండ్ లిస్టులో లేని ఫేస్‌బుక్ యూజర్లు.. ఆ ఆకౌంట్‌ను ఓపెన్ చేయలేరు. దాని వల్ల ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
అయితే.. ప్రొఫైల్‌ను ఎలా లాక్ చేసుకోవాలి? మళ్లీ ప్రొఫైల్ లాక్‌ను తీసేయాలంటే ఎలా? లాంటి విషయాలు చాలామంది ఫేస్‌బుక్ యూజర్లకు తెలియవు. ఫేస్‌బుక్ ప్రొఫైల్ లాక్‌ను మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు.
మొబైల్ యాప్ ద్వారా ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?
ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేసి.. ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ యాడ్ టు స్టోరీ పక్కన మూడు చుక్కలు ఉంటాయి. వాటి మీద క్లిక్ చేస్తే.. లాక్ ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే లాక్ ప్రొఫైల్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో వివరాలు ఉంటాయి. దాన్ని ట్యాప్ చేస్తే ప్రొఫైల్ లాక్ అవుతుంది. భవిష్యత్తులో లాక్ ఆప్షన్ తీసేయాలనుకుంటే.. మళ్లీ లాక్ ప్రొఫైల్ ఆప్షన్‌లోకి వెళ్లి.. దాన్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది.
డెస్క్‌టాప్ ద్వారా ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?
ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి.. లాగిన్ అయ్యాక.. See your profile అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వా మూడు డాట్స్ మీద క్లిక్ చేస్తే.. Lock Profile అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే.. ప్రొఫైల్ లాక్‌కు సంబంధించిన సమాచారం ఒక పాప్ అప్ విండోలో కనిపిస్తుంది. దాని కింద Lock Your Profile అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే.. You’ve locked your profile అని ఒక మెసేజ్ వస్తుంది. అంతే.. మీ ప్రొఫైల్ లాక్ అయినట్టే.. ప్రొఫైల్ లాక్ అయ్యాక.. ఫ్రెండ్స్ మాత్రమే టైమ్‌లైన్‌లో షేర్ చేసిన పోస్టులను చూడగలుగుతారు
Thanks for reading How to Lock Facebook Profile ?
No comments:
Post a Comment