Job Opportunity: పేటీఎంలో 20 వేల ఉద్యోగాలు.. అర్హత పదో తరగతి!
దిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం దేశవ్యాప్తంగా 20 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. సంస్థ డిజిటల్ ఉపకరణాలపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకుగానూ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్(ఎఫ్‌ఎస్‌ఈ)లను నియమించుకుంటోంది. పది లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనం+కమిషన్ కలుపుకొని నెలకు రూ.35 వేలు సంపాదించుకొనే అవకాశం ఉందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇది మంచి అవకాశమని పేర్కొంది. మహిళా వ్యాపారస్థులను ప్రోత్సహించేందుకుగానూ మహిళా ఉద్యోగార్థులు ఈ రంగంలోకి రావాలని పిలుపునిచ్చింది.
విధుల్లో భాగంగా ఈ ఎఫ్‌ఎస్‌ఈలు.. క్యూఆర్ కోడ్, పీఓఎస్ యంత్రాలు, సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పోస్ట్‌పెయిడ్, రుణాలు, ఇన్సూరెన్స్‌లు ఇలా పేటీఎంకు చెందిన అన్ని ఉత్పత్తులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ద్విచక్రవాహనం ఉండి సేల్స్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది.
Website :https://paytm.com/
Thanks for reading Job Opportunity: 20 thousand jobs in Paytm .. Eligible tenth class!
No comments:
Post a Comment