AP NEWS: అంగన్‌వాడీ టీచర్లకు పదోన్నతలు: జగన్
అమరావతి: కొత్త విద్యావిధానంపై అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కొత్త విధానం ప్రకారం... పీపీ-1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరణ చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 14వేల పాఠశాలలు అదనంగా అవసరమవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. కొత్త విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా ఉండాలని సీఎం సూచించారు. వర్గీకరణతో విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడతారని సీఎం వివరించారు. ఈవిధానం ద్వారా ఉపాధ్యాయులకు పనిభారం కూడా తగ్గుతుందన్నారు. అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు పదోన్నతులకు కల్పిస్తామన్నారు. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని జగన్ ఆదేశించారు. కొత్త విద్యావిధానం, నాడు-నేడుకు రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. కొత్త విద్యావిధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈనెల 16న పశ్చిమగోదావరి జిల్లాలో విద్యాకానుక పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
Thanks for reading Promotions for Anganwadi Teachers: Jagan
No comments:
Post a Comment