Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, August 23, 2021

The third threat is the possibility of 5 lakh corona cases a day in September alone.


 మూడో ముప్పు తథ్యం
సెప్టెంబరులోనే రోజుకు 5 లక్షల కరోనా కేసులొచ్చే అవకాశం
అప్రమత్తంగా ఉండాల్సిందే

కేంద్రాన్ని హెచ్చరించిన నీతి ఆయోగ్‌, ఎన్‌ఐడీఎం

 దిల్లీ: కరోనా మూడో ఉద్ధృతి.. సెప్టెంబరు, అక్టోబరులో దేశాన్ని చుట్టుముట్టనుందని రెండు కీలక సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మూడో వేవ్‌ తథ్యమని అవి పేర్కొన్నాయి. సెప్టెంబరులోనే దాదాపు రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దాదాపు రెండు లక్షల ఐసీయూ పడకలను సిద్ధం చేసుకోవాలని తెలిపాయి. ఈ మేరకు జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం), నీతి ఆయోగ్‌ కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. హోంమంత్రిత్వశాఖ అధీనంలోని ఎన్‌ఐడీఎం.. కరోనా మూడో దశ ముప్పుపై తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. ఇందులో కొవిడ్‌-19 ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నీతి ఆయోగ్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆగస్టులోనే రోజుకు 4 నుంచి 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మూడో ఉద్ధృతిలో ఆసుపత్రుల్లో 23 శాతం మంది చేరతారని, దాదాపు రెండు లక్షల ఐసీయూ పడకలను కేంద్రం సిద్ధం చేసుకోవాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు.


రానున్న 2 నెలలే కీలకం

కొవిడ్‌-19 పోరులో భారత్‌కు సెప్టెంబరు, అక్టోబరు నెలలు కీలకం కానున్నాయని జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. వైరస్‌లో మార్పులు అధికమైతే సెప్టెంబరులోనే రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పరిస్థితులను బట్టి సెప్టెంబరు నుంచి అక్టోబర్‌ చివరినాటికల్లా ఎప్పుడైనా దేశంలో మూడో ఉద్ధృతి కనిపించవచ్చని పేర్కొంది. ఇందులో చిన్నారులపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుందని చెప్పే ఆధారాలు ఎక్కడా లేవని స్పష్టంచేసింది. ఒకవేళ వస్తే మాత్రం పిల్లలకు సరిపడా వైద్యసౌకర్యాలు దరిదాపుల్లోకూడా లేవని ఆందోళన వ్యక్తంచేసింది. వ్యాక్సిన్‌ కార్యక్రమం మందకొడిగా సాగడంపై కూడా ఈ నివేదిక చర్చించింది. ప్రస్తుతం 7.6 శాతం మంది మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు వేసుకున్నారని, ఈ సంఖ్య పెరగకపోతే రోజుకు ఆరు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ‘‘ప్రముఖ నిపుణులందరూ దేశంలో కొవిడ్‌ మూడో వేవ్‌ తథ్యమని చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ ద్వారాకానీ, వ్యాక్సినేషన్‌ ద్వారాకానీ రోగనిరోధకశక్తి పెంచుకొని సామూహిక రోగనిరోధకశక్తిని సాధిస్తేనే కరోనాకు ముగింపు సాధ్యమని అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. ఇదివరకు 67%మంది దేశ ప్రజలకు ఇలాంటి శక్తి వస్తేనే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందన్నారు. అయితే ఇప్పుడు వైరస్‌లో ఉత్పరివర్తనాలు పెరిగి, అందులో కొన్ని వ్యాక్సిన్లనుకూడా తప్పించుకోగలుగుతాయని చెబుతున్నందున హెర్డ్‌ ఇమ్యూనిటీ అన్నది ఇప్పుడు సంక్లిష్టంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో 80-90% మంది రోగనిరోధకశక్తి సాధిస్తేనే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమయ్యే పరిస్థితి నెలకొంది. దేశంలోని విభిన్న నిపుణులు, సంస్థలు చెప్పినదాని ప్రకారం మూడో వేవ్‌ తథ్యమన్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో పిల్లలు ఎక్కువ ప్రభావితమవుతారని చెప్పడానికి బలం చేకూర్చే సమాచారం తగినంతగా అందుబాటులో లేదు. అయితే వైరస్‌ నిరంతరం పరివర్తనం చెందుతూపోతుంది కాబట్టి పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోతే ఇది పెద్ద సవాల్‌గా మారే ప్రమాదం ఉంటుంది.  వైద్యఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం ఇప్పటివరకు కొవిడ్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరిన పిల్లల్లో 60-70% మంది అనారోగ్యసమస్యలు, తక్కువ రోగనిరోధశక్తి ఉన్నవారే. ఒకవేళ మూడో వేవ్‌లో పెద్ద సంఖ్యలో పిల్లలు ఇన్‌ఫెక్షన్‌కు గురైతే అందుకు సరిపడా డాక్టర్లు, సిబ్బంది, వెంటిలేటర్ల తరహా పరికరాలు, అంబులెన్సులు దేశవ్యాప్తంగా ఎక్కడా లేవు. మూడో వేవ్‌ వస్తే అది తొలుత వ్యాక్సిన్‌ తీసుకోని పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందువల్ల పాఠశాలల నిర్వహణ అన్నది కచ్చితతంగా డేటా, భద్రతా చర్యల ఆధారంగా తీసుకోవాలన్న డబ్ల్యూహెచ్‌వో సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి ఇప్పటినుంచే సమాయత్తం కావడం మంచిది’’ అని నివేదిక పేర్కొంది.

కొత్త వేరియంట్‌ వస్తేనే...

డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్‌ వస్తే.. అది సెప్టెంబరు ఆఖరికి క్రియాశీలకంగా ఉంటే.. మూడో ఉద్ధృతి నవంబరులో గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన శాస్త్రవేత్త మణీంద్ర అగర్వాల్‌ తెలిపారు. కొత్త వేరియంట్‌ రాకపోతే మూడో వేవ్‌ ఉండకపోవచ్చని పేర్కొన్నారు.




Thanks for reading The third threat is the possibility of 5 lakh corona cases a day in September alone.

No comments:

Post a Comment