Third shot: మూడో డోసు టీకాకు ఓకే అన్న అగ్రరాజ్యం
వాషింగ్టన్: కరోనా మూడోదశ వ్యాప్తి సహా బలహీన రోగనిరోధకశక్తిని దృష్టిలో ఉంచుకొని అగ్రరాజ్యం అమెరికా కొవిడ్ మూడో డోసు టీకాకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికన్లు రెండు డోసుల తర్వాత మరో టీకా తీసుకునేందుకు అనుమతిస్తూ అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కొవిడ్ ముప్పు అధికంగా ఉన్న వారితో పాటు.. సాధారణ ప్రజలకు సైతం వైరస్ నుంచి రెట్టింపు రక్షణ లభించనుందని సీడీసీ డైరెక్టర్ రొచెల్లె వాలెన్‌స్కీ పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా టీకాలు అందిస్తున్నారు.
అవయవ మార్పిడి జరిగిన వారు, ఇతర కారణాలతో బలహీనంగా ఉన్నవారు మూడో డోసు వెంటనే తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ కానీ, అధికారిక ధ్రువీకరణ కానీ అవసరంలేదని సీడీసీ అధికారి డా.అమందా కోన్ స్పష్టం చేశారు. మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ డేవిడ్ బౌల్‌వేర్ సీడీసీ నిర్ణయానికి నిర్ణయానికి మద్దతు తెలిపారు. రెండు డోసులు వేసుకున్నవారిలో చాలా చాలామందికి రోగనిరోధకశక్తి లేదని.. అలాంటి వారికి మూడో డోసు ఇవ్వడం ఉపయుక్తమని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి మరోమారు అగ్రరాజ్యంపై పంజా విసురుతున్న క్రమంలో మూడో డోసు టీకాకు అనుమతివ్వడం అమెరికన్లకు మరింత రక్షణ కల్పించనుందని అక్కడి వైద్య నిపుణులు భావిస్తున్నారు. టీకాల పంపిణీ విషయంలో పేద, ధనిక దేశాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బూస్టర్ డోసుపై తాత్కాలిక నిషేధం విధించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తిని గత నెల అమెరికా తిరస్కరించింది.
Thanks for reading Third shot: America says OK to third dose vaccine
No comments:
Post a Comment