Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, August 15, 2021

TTD: Vruksha prasadam in Srivari laddu cover..., if watered in a clay pot....


 TTD : శ్రీవారి లడ్డూ కవరు లో వృక్ష ప్రసాదం , మట్టి కుండీలో పెట్టి నీళ్లు పోస్తే

Tirupati Laddu : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎంత విశేషం ఉందో…లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైనా తిరుపతి వెళుతున్నారంటే…మా కోసం ఓ లడ్డూ తీసుకరావాలంటూ…కోరుతుంటారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందింది ఈ లడ్డూ. తిరుమలకు వెళ్లి..శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని భక్తులు కొనుగోలు చేస్తుంటారు.ఈ లడ్డూ ప్రసాదాన్ని గతంలో కవర్ లో ఇస్తుంటారనే సంగతి తెలిసిందే.

అయితే..తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నడుం బిగించింది. ఇప్పటికే ప్లాస్టిక్ పై నిషేధం విధించింది. లడ్డూలను ప్లాస్టిక్ కవర్ లో కాకుండా…పర్యావరణ హితంగా ఉండే సంచులను అందుబాటులోకి తెచ్చింది. క్లాస్ బ్యాగ్స్, సీడ్ ఎంబెడెడ్ కవర్లను తీసుకొచ్చింది. గ్రీన్ మంత్ర అనే సంస్థతో కలిసి…ఈ కవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక్కడ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఇచ్చే ఈ కవర్లలో శ్రీవారి ప్రసాదంతో పాటు 'వృక్ష ప్రసాదం' కూడా అందివ్వాలని నిర్ణయం తీసుకుంది. పర్యావరణ హిత కవర్లు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఈ కవర్లు మట్టిలో కలిసిపోయేలా తయారు చేశారు.

పర్యావరణాన్ని కాపాడుకుందాం..స్వామి వారికి కృపకు పాత్రులవుదాం…అనే నినాదంతో ఈ వృక్ష ప్రసాద కవర్లను గ్రీన్ మంత్ర తయారు చేస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూలను తీసుకెళ్లిన భక్తులు..ఈ సీడ్

ఎంబెడెడ్ కవర్లను మట్టి కుండీలో పెట్టి నీళ్లు పోస్తే…తులసి మొక్కలు వస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఈ కవర్ల తయారీకి చెట్ల బెరడు, కంద మూలాలను ముడి పదార్థాలుగా వాడడం జరిగిందని చెబుతున్నారు. ఈ కవర్లు మట్టిలో పెట్టకుండా అలానే ఉంచితే పాడైపోతాయని అనే డౌట్ కూడా రావొచ్చు. అలాంటి అనుమానం పెట్టుకోవద్దని, మట్టిలో పెట్టేంతవరకు డీకంపోజ్ కావని స్పష్టం చేస్తున్నారు. సంస్కృతిలో ఎంతో విశిష్టత కలిగిన తులసి మొక్కలను ప్రతింట్లో ఉండేలా చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని గ్రీన్ మంత్ర సంస్థ ప్రతినిధులు అంటున్నారు. వీరు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.

Thanks for reading TTD: Vruksha prasadam in Srivari laddu cover..., if watered in a clay pot....

No comments:

Post a Comment