ఈ-రూపీ అంటే ఏమిటి.. ఎలా ఉపయోగించాలి?
e-RUPI: ఫోన్‌పే, గూగుల్ పే, డెబిట్‌కార్డ్, క్రెడిట్ కార్డులు..... ఇలాంటివేమీ అక్కర్లేకుండానే నగదు రహిత చెల్లింపులు చేసేలా కేంద్రం కొత్త పథకాన్ని అమల్లోకి తేనుంది. మరింత తేలికగా నగదు లావాదేవీలు నిర్వహించేందుకు కొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేబోతోంది.
నగదు రహిత లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త స్కీంని రూపొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేమెంట్ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్‌లెస్, కాంటాక్ట్‌లెస్‌గా ఉండేలా ఈ-రూపీ స్కీం(E-RUPI)ని ప్రవేశపెట్టనుంది.
తొలిదశలో వీళ్లకే?
ప్రస్తుతం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనా పథకంలో టీబీ రోగులకు ప్రతీ నెల ఔషధాలు అందిస్తోంది, అవసరమైన రోగ నిర్థారణ పరీక్షలు చేయిస్తోంది, అంతేకాదు మాతా శిశు అభివృద్ధి పథకం కింద పౌష్టికాహారం అందిస్తోంది. వీటితో పాటు రైతులకు సబ్సిడీ కింద ఎరువులు అందిస్తోంది. వీటికి సంబంధించిన ఆర్థిక సహయాన్ని రాబోయే రోజుల్లో ఈ రూపే ద్వారా కేంద్రం చేపట్టనుంది. ప్రైవేటు రంగ సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంక్షేమం విషయంలో e-RUPI పద్దతిని ఉపయోగించుకోవచ్చని సూచించింది కేంద్రం.
ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్‌ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్‌ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేసింది.
ఈ-రూపీ వోచర్లను ఎలా ఉపయోగించాలి?
ఈ వోచర్లు ఇ-గిఫ్ట్ కార్డులు వంటివి, ఇవి ప్రీపెయిడ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.ఈ కార్డుల కోడ్ ని ఎస్ఎమ్ఎస్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ ద్వారా పంచుకోవచ్చు. ఉదాహరణకు, కోవిడ్-19 వ్యాక్సిన్ కొరకు మీరు ఈ-రూపీ వోచర్లను తీసుకున్నట్లయితే వాటిని కేవలం వ్యాక్సిన్ల కొరకు మాత్రమే రీడీమ్ చేయాల్సి ఉంటుంది.
ఇతర పేమెంట్స్ కంటే ఈ-రూపీ ఎందుకు భిన్నం?
ఈ-రూపీ అనేది ఎలాంటి ఫ్లాట్ ఫారం కాదు. ఇది నిర్ధిష్ట సేవల కొరకు ఉద్దేశించబడిన వోచర్. ఈ-ఆర్ యుపీఐ వోచర్లు అనేవి నిర్ధిష్టమైన వాటి కోసం మాత్రమే ఉద్దేశించబడినవి. బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ పేమెంట్ యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. అదే ఇందులోని ప్రధాన తేడా. ఈ వోచర్లు ఎక్కువగా ఆరోగ్య సంబంధిత చెల్లింపుల కోసం ఉపయోగించబడతాయి. కార్పొరేట్లు తమ ఉద్యోగుల కొరకు ఈ వోచర్లను జారీ చేయవచ్చు. వ్యాక్సిన్ ఈ-వోచర్ కోసం ఒక ఆప్షన్ తీసుకువస్తామని కేంద్రం ఇంతకు ముందు తెలిపింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కోసం ఈ-వోచర్ కొనుగోలు చేయవచ్చు, అలాగే మరొకరికి బహుమతిగా ఇవ్వవచ్చు. వోచర్లను కొనుగోలు చేసి ఇతరులకు జారీ చేస్తున్న వ్యక్తి వోచర్ల వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు.
ఎలా రీడీమ్ చేసుకోవాలి?
వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ సరిపోతుంది. నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకారం, ఇప్పటికే ఎనిమిది బ్యాంకులు ఈ-ఆర్ యుపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్,
పంజాబ్ నేషనల్ బ్యాంక్,
బ్యాంక్ ఆఫ్ బరోడా,
కెనరా బ్యాంక్,
ఇండస్ సిండ్ బ్యాంక్,
ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి.
Thanks for reading What is e-RUPI and how to use it?
No comments:
Post a Comment