Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, August 13, 2021

WhatsApp: Data transfer with one click .. Status tab is changing!


 WhatsApp: ఒక్క క్లిక్‌తో డేటా బదిలీ.. స్టేటస్‌ ట్యాబ్ మారుతోంది! 

వాట్సాప్ యూజర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఛాట్ హిస్టరీ బదిలీ ఫీచర్‌ను ఎట్టకేలకు వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో యూజర్స్ ఐఓఎస్‌ డివైజ్‌లోని ఛాట్ డేటాను సులభంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లోకి బదిలీ చేసుకోగలరు. గతంలో ఛాట్ డేటాను ఒక డివైజ్‌ నుంచి మరో డివైజ్‌కి మార్చుకోవాలనుకుంటే థర్డ్‌పార్టీ యాప్‌లను ఉపయోగించడం లేదా క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకుని కొత్త డివైజ్‌లోకి డౌన్‌లోడ్ ట్రాన్స్‌ఫర్ చేసేవారు. దీనివల్ల కొన్నిసార్లు డేటా లీక్ లేదా డిలీట్ అయ్యేది. దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ ఛాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకమీదట యూజర్స్‌ ఐఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్‌, ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి సులువుగా ఛాట్‌ డేటాను బదిలీ చేసుకోవచ్చు. వాట్సాప్ ఈ ఫీచర్‌ గురించిన వివరాలను శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ కార్యక్రమంలో ప్రకటించింది. ప్రస్తుతం కొద్ది మంది యూజర్స్‌కే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్స్‌కి అందరికీ అందుబాటులోకి రానుంది. 


‘‘యూజర్స్‌ ఇకమీదట వాట్సాప్‌లోని ఛాట్ హిస్టరీ, వాయిస్‌ నోట్, ఫొటోస్‌, వీడియోలని వేర్వేరు ఓఎస్‌లతో పనిచేసే ఫోన్లలోకి సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ఇది ఎంతో సురక్షితమైన పద్ధతి. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లను ఈ ఫీచర్ సపోర్టు చేస్తుంది. ముందుగా ఈ ఫీచర్‌ని ఆండ్రాయిడ్  డివైజ్‌లలో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. త్వరలోనే ఐఓఎస్ యూజర్స్‌కి పరిచయం చేస్తాం. ఈ ఫీచర్‌ కోసం ఎంతో కాలంగా యూజర్ల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఎట్టకేలకు మొబైల్ ఆపరేటింగ్ సిస్టం కంపెనీలతో కలిసి దీన్ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చాం’’ అని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ వాట్సాప్ యూజర్‌ స్టేటస్‌ చూడటానికి ప్రత్యేకంగా స్టేటస్‌ అనే ట్యాబ్ ఉండేది. త్వరలో ఆ ట్యాబ్‌ని తొలగించనున్నారు. యూజర్ స్టేటస్ చూడాలంటే ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేస్తే వ్యూ ప్రొఫైల్ ఫొటో, వ్యూ స్టేటస్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో స్టేటస్‌పై క్లిక్ చేస్తే సరిపోతుందట. ప్రస్తుతం పరీక్షల దశలో ఈ ఫీచర్ కొద్ది మంది బీటా యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Thanks for reading WhatsApp: Data transfer with one click .. Status tab is changing!

No comments:

Post a Comment