WhatsApp new fearture : వాట్సాప్ వాయిస్ మెసేజ్.. పంపే ముందే వినొచ్చు!
ఇతర మెసేజింగ్ యాప్‌లకు ధీటుగా యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌ను తీసుకొస్తూ యూజర్స్‌ను ఆకట్టుకుంటోంది వాట్సాప్. త్వరలో మరో ఆసక్తికర ఫీచర్‌ను యూజర్స్‌కు పరిచయం చేయనున్నట్లు సమాచారం. వాట్సాప్ వేవ్‌ఫార్మ్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్స్ పంపే వాయిస్ మెసేజ్‌లను ముందుగానే వినొచ్చు. గతంలో వాయిస్ మెసేజ్‌లను రికార్డు చేసి డైరెక్ట్‌గా పంపేవారు. వేవ్‌ఫార్మ్ ఫీచర్‌తో మనం పంపే మెసేజ్‌ను రికార్డు చేసిన తర్వాత విని అందులో ఏవైనా మార్పులు ఉంటే ఆ మెసేజ్‌ని డిలీట్ చేసి.. కొత్త మెసేజ్ రికార్డు చేసి పంపే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్స్ మధ్య సమాచార మార్పిడి మరింత మెరుగ్గా ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది.
దీంతోపాటు వాయిస్ మెసేజ్ ఇంటర్‌ఫేస్‌లో కూడా మార్పులు చేస్తున్నారు. గతంలో వాయిస్ మెసేజ్‌ని ప్లే చేసినప్పుడు లైన్ మీద డాట్ సింబల్ కదులుతూ ఉంటుంది. కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌లో ఆడియో వేవ్‌లు కనిపిస్తాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచిన్నట్లు సమాచారం. త్వరలోనే యూజర్స్ అందరికీ పరిచయం చేస్తారని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఇవేకాకుండా మెసేజ్ రియాక్షన్, కలర్ స్కీమ్, వెబ్ ప్రివ్యూ, డేటా ట్రాన్స్‌ఫర్, స్టేటస్ ట్యాబ్ వంటి కొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకురానుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి రానున్నాయి.
Thanks for reading WhatsApp new fearture: WhatsApp Voice Message .. Listen Before Sending!
No comments:
Post a Comment