AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.... వివరాలు ఇలా
●దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది.
●ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.
●ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
●దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది.
●దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.
●ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు.
పరీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేషన్, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.
●ముఖ్య సమాచారం
■దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ 27, 2021
■దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021
■సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021
■పరీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400
■పరీక్ష తేదీ : జనవరి 9, 2022
■పరీక్ష సమయం ఆరోతరగతి ప్రవేశాలకు 150 నిమిషాలు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు 180 నిమిషాలు
■అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ www.nta.ac.in
■అర్హతలు
●ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
●వయసు 31.03.2021 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.
◆దరఖాస్తు విధానం
◆దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
●ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ ను సందర్శించాలి.
●అనంతరం అధికారిక బ్రౌచర్‌ను పూర్తిగా చదవాలి.
●అప్లికేషన్ ఫాంలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సరిగా ఇవ్వాలి.
●జేపీజీ / జేపీఈజే ఫార్మేట్‌లో ఫోటోను అప్లోడ్ చేయాలి. సాఫ్ట్ కాపీ సైజ్ నిర్దేశించిన ఫార్మెట్‌లో ఉండాలి.
●విద్యార్హత సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ సంబంధిత సర్టిఫికెట్లను సాఫ్ట్ కాపీ రూపంలో అప్లోడ్ చేయాలి.
Thanks for reading AISSEE 2022: Release of Notification for Sainik School Admissions
No comments:
Post a Comment