AP EAPCET: అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు విడుదల
అమరావతి: ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్-2021) ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ ఫలితాలను వెల్లడించగా.. తాజాగా అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను వెల్లడించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశానికి 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 78,066 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాల్లో 72,488 (92.85 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందం విష్ణు వివేక్‌కు మొదటి ర్యాంకు వచ్చినట్లు మంత్రి సురేశ్ తెలిపారు. అనంతపురానికి చెందిన శ్రీనివాస కార్తికేయకు రెండో ర్యాంకు, హనుమకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్‌రావుకు మూడో ర్యాంకు, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన గజ్జల సమీహనరెడ్డి, ప్రగతి నగర్‌కు చెందిన కాసా లహరికి నాలుగు, ఐదు ర్యాంకులు వచ్చినట్లు మంత్రి వివరించారు.
Thanks for reading AP EAPCET: Release of Agriculture, Pharmacy Results
No comments:
Post a Comment