Home Loan: ఉద్యోగస్థులకు 6.66% వడ్డీతో.. రూ.50 లక్షల గృహరుణం.
మీరు జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగస్థులా? ఇల్లు కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నారా? గృహ రుణం ఏ బ్యాంకులో తీసుకోవాలి.. అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. 6.66 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల వరకు గృహ రుణం పొందవచ్చు. ఈ ఆఫర్‌ని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) అందిస్తోంది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) ఇప్పుడు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్)తో టై-అప్ అయ్యింది. గృహ రుణ ఉత్పత్తులను తమ 4.5 కోట్ల మంది ఖాతాదార్లకు విక్రయించేందుకు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌తో జత కట్టినట్లు ఐపీపీఐ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
650 బ్రాంచ్‌లు, 1,36,000 బ్యాంకింగ్ యాక్సిస్ పాయింట్లతో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు బలమైన, విస్తృతమైన నెట్‌వర్క్ ఉంది. అంతేకాకుండా ఐపీపీబీలో దాదాపు 2లక్షల మంది పోస్టల్ ఉద్యోగులు(పోస్ట్‌మ్యాన్, గ్రామీణ డాక్ సేవక్‌లు) మైక్రో ఏటీఎమ్, బయోమెట్రిక్ పరికరాలతో ఇంటి వద్దే(డోర్‌స్టెప్) బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు. ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ గృహ రుణాలను దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందించడంలో ఈ వ్యవస్థ ముఖ్యపాత్ర పోషిస్తోందని ఐపీపీబీ తన ప్రకటనలో వెల్లడించింది.
Thanks for reading Home loan: 6.66% interest for employees .. Rs.50 lakhs housing.
No comments:
Post a Comment