Reconstitution of Parent Committees Guidelines issued Reg Rc.16021 Dt:04.09.21 PC Schedule Guidelines.
PC (SMC) Election Guidelines తెలుగులో
PC 2021 ఎన్నికల షెడ్యూల్, రికార్డులు, రిజిస్టర్ లు, వివిధ కమిటీలు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఎక్స్ అఫీసియో సభ్యులు, కో ఆప్టెడ్ సభ్యులు, వాటి ఎన్నిక, నిర్వహణ, చివరిగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, వారి ప్రమాణ స్వీకారం, మొదటి PMC సమావేశం, SMC/PMC ఎన్నిక పై సందేహాలు మరియు సమాధానాలు ఇలా పూర్తి సమాచారం.
●ఎన్నికల ప్రక్రియ HM నిర్వహించాలి.
●కనీసం 50% Parents PC Election ఎంపిక ప్రక్రియకు హాజరు కావలెను.
●ఎన్నికల ప్రక్రియ సాధారణంగా చేతులు ఏత్తడం/నోటితో చెప్పడం ద్వారా జరపాలి.అసాధారణ పరిస్థితులలో మాత్రమే Secret Ballot ఉపయోగించాలి.
●Mother/Father/Guardian లో ఎవరో ఒక్కరు మాత్రమే ఎన్నికలలో పాల్గొనే దానికి అర్హులు.
●తల్లి తండ్రులకు వేర్వేరు తరగతులలో విద్యార్థులు ఉంటే వారు ఆయా తరగతుల PC ఎన్నికలలో పాల్గొనవచ్చు.
●PC సభ్యులుగా ఎంపిక కాబడిన వారు, వారి Chairmen &Vice chairmen ను ఎంపిక చేయాలి. Chairmen &Vice chairman లో ఒకరు Disadvantage group కు చెందినవారు.మరొకరు మహిళ అయి ఉండాలి.
●Local Bodies కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కానీ, అపాఠశాల HM కానీ, Asst teacher కానీ. PC ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హులు.
●Weaker Section ,BC, Minorities మరియు OC Parents వార్షిక ఆదాయం RS 60 000 లోపు ఉండాలి.
●ఎన్నికల ప్రక్రియకు ఎవరయినా విఘాతం కలిగించినచో వారిపై చట్టపరమయిన చర్యలు తీసుకోన బడుతాయి. There should not be any political interference.
●MRO,MPDO,VRO,VRA లు ఎన్నికల Observers. గా రావచ్చును.
●Disadvantages & weaker section నుంచి సభ్యులు దొరకనపుడు It can be filled as per existing Rules of Reservation.
●PC ఎన్నికలలో పాల్గొనే voters వారి ID Cards(. Aadhar card /Ration card) తప్పక తీసుకు రావాలి.
తరుచు స్మరించే ప్రశ్నలు - పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్.ఎమ్.సి)
1 ప్ర) పాఠశాల యాజమాన్య కమిటీ అంటే ఏమిటి ?
జ) విద్యా హక్కు చట్టం 2009 లోని సెక్షన్ - 21(1) అమలులో భాగంగా పాఠశాల నిర్వహణ, యాజమాన్యలను చూసుకోడానికి పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీని పాఠశాల యాజమాన్య కమిటీ అంటాం.
2. ఎస్.ఎమ్.సి బాధ్యత ఏమిటి ?
జ) పాఠశాల సక్రమంగా నడిచేలా అజమాషీ చేయడం, కావలసిన సదుపాయాలను కల్పిస్తూ పాఠశాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన భాద్యత.
3 ప్ర) ఎస్.ఎమ్.సి ప్రధాన పాత్రదారులు ఎవరు ?
జ) ఎస్.ఎమ్.సి కమిటిలో ప్రధాన పాత్రదారులు విద్యార్థుల తల్లిదండ్రులు
4 ప్ర) ఎస్.ఎమ్.సిని ఏఏ పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి ?
జ) ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలలు (ఎయిడెడ్ పాఠశాలలు) తప్పనిసరిగా పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయాలి.
5ప్ర) ఒక పాఠశాలలో ఎన్ని కమిటీలను ఏర్పాటు చేయాలి ?
జ) ప్రాధమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒకే కమిటీని ఏర్పాటు చేయాలి ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత తరగతులకు విడిగా ఎస్.ఎమ్.సిని ఏర్పాటు చేసుకోవాలి దీనినే ప్రాథమికోన్నత పాఠశాల యాజమాన్య కమిటీ అంటారు.
6ప్ర) ఒక తరగతిలో వేరు వేరు మీడియములు ఉంటే వేరు వేరు తరగతులగా భావించవచ్చా?
జ) ఒక తరగతిలో ఎన్ని మీడియములు, సెక్షన్లు ఉన్నా అన్నింటిని ఒకే తరగతిగా భావించాలి.
7 ఎస్.ఎమ్.సి పదవికాలము ఎంత ?
జ) ఒకసారి ఏర్పాటు అయిన పాఠశాల యాజమన్యా కమిటీ వ్యవస్థ నిరంతంగా కొనసాగుతుంది (ఎమ్.ఇ.ఓ మరియు డి.ఇ.ఓ చే రద్దు లేక విలీనము చేయడబడినప్పుడు తప్పు) కమిటీ సభ్యుల పదవీకాలం MAX 2YEARS
8) ఎస్.ఎమ్.సి సభ్యులను ఏ విధంగా ఎన్నుకోవాలి?
జ) ఒక్కో తరగతి నుండి ఎన్నిక కావలసిన సభ్యులు మొత్తం ముగ్గురు (అన్ని సెక్షన్లు మరియు మాద్యమాలలో చదువుతున్న పిల్లలు తల్లిదండ్రులు) ముగ్గురులో సామాజికంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాల వారి నుండి కనీసం ఒకరు (ఎస్.సి, ఎస్.టి, ఆనాధులు, వీధిబాలలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, హెచ్.ఐ.వి బాధిత పిల్లలు మొ|| వారు తల్లిదండ్రులు/సంరక్షకులు) బలహీన వర్గాలకు చెందిన వారి నుండి ఒకరు (బి.సి మైనార్జి మరియు ఆదాయం 60 వేలకు మించిన ఓ.సి కుటుంబాలు పేరంట్స్/గార్డెయన్) జనరల్ కేటగిరి నుండి ఒకరు ఈ ముగ్గురు సభ్యులలో ఇద్దరు తప్పని సరి మహిళలు ఉండాలి.
9ప్ర) ప్రాధమిక మరియు ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో సభ్యులు ఎంతమంది ఉంటారు.
జ ) ప్రాధమిక పాఠశాల (1 - 5వ తరగతి) - 15 (10 మంది మహిళలు తప్పనిసరిగా ఉండాలి)
ప్రాథమికోన్నత పాఠశాల (1- 7వ తరగతి) - 21 (14 మంది మహిళు సరిగా ఉండాలి)
ప్రాధమికోన్నత పాఠశాల (1-8వ తరగతి) - 24 (16 మంది మహిళలు తప్పని సరిగా ఉండాలి).
ఉన్నత పాఠశాల (6 -8వ తరగతి) - 9(6 మంది మహిళలు తప్పని సరిగా ఉండాలి)
10 ప్ర) ఎస్.ఎమ్.సి సభ్యుల ఎన్నికలను ఎవరు నిర్వహించాలి ?
జ) పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
11 ప్ర) ఎస్.ఎమ్.సి ఎన్నికలు నిర్వహించడానికి ఎంత మంది హాజరు కావాలి?
జ) కనీసం 50 శాతం మంది తల్లిదండ్రులు/సంరక్షకులు
12 ప్ర) ఎస్.ఎమ్.సి ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి విధానాన్ని పాటించాలి ?
జ) నోటి మాటతో గాని చేతులు ఎత్తడం ద్వారా గాని రహస్య బ్యాలెట్ విధానము ద్వారా కానీ ఎన్నికలు జరిపించాలి.
13 ప్ర) తరగతిలోని కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఎవరికి ఉంటుంది ?
జ) తరగతిలోని పిల్లల తల్లిదండ్రులలో ఎవరోఒకరికి మాత్రమే కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటువేసే అర్హత
14 ప్ర) ఒకటి కన్నా ఎక్కువ తరగతులో చదువుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు ఆయా తరగతుల ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉంటుందా ?
జ) ఉంటుంది.
15 ప్ర) సభ్యుని కుమారుడు/కుమారై పాఠశాలలను వదిలి వెళ్లినట్లైతే ఆ సభ్యుని పదవీకాలము ఏది?
జ) ముగిసిపోతుంది.
16 ప్ర) సభ్యులు ఖాళీలను పూరించడానికి ఏమి చేయాలి ?
జ) ప్రతి సంవత్సరం కమిటీలోని ఖాళీలను పూరించడానికి ప్రవేశ తరగతులలో ఎన్నికలు నిర్వహించాలి
17 ప్ర) ఎస్.ఎమ్.సి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎవరు ఎన్నుకుంటారు ?
జ) తల్లిదండ్రుల/సంరక్షకుల వర్గ సభ్యులు, వారిలో నుండి అధ్యక్షులు మరియు ఉపాధ్యాక్షులను ఎన్నుకుంటారు. వీరిలో ఒకరు తప్పక ప్రతికూల వర్గాలు లేదా బలహీన వర్గాలకు చెందినవారై ఉండాలి. వీరిలో కనీసం ఒకరు మహిళ ఉండాలి.
18 ప్ర) ఎస్.ఎమ్.సి మెంబర్ కన్వీనర్ ఎవరు ?
జ. ప్రధానోపాధ్యాయులు/ఇన్ చార్జీ ప్రధానోపాధ్యాయులు
19 ప్ర) ఎస్.ఎమ్.సి లో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఎవరిని నియమించాలి ?
జ) 1. ప్రధానోపాధ్యాయులు/ఇన్చార్జీ ప్రధానోపాధ్యాయులు
2. మండల విద్యాశాఖాధికారి చేత నామినేట్ చేయబడిన పాఠశాల ఉపాధ్యాయుడు (హెడ్ టీచర్) పురుషుడు అయితే ఉపాధ్యాయునులు నుండి ఎంపిక చేస్తారు. హెడ్ టీచర్ స్త్రీ అయితే పురుషునికి
3. సంబంధిత వార్డు మెంబర్ కౌన్సిలర్
4. అంగన్వాడీ వర్కర్/వర్కర్లు
5. మాల్టి పరజ్ హెల్త్ వర్కర్ మహిళ (ఎ.ఎన్.ఎమ్)
6. స్థానిక మహిళా సమాఖ్
Important documents for Reconstitution of PC Here
PC Committes reconstitution Proceeding
పీసీ కమిటీ ఎన్నిక - ఓటర్ల జాబితా నమూనా
పేరెంట్ కమిటీ ఎన్నిక మార్గదర్శకాలు
కమిటీ ల ఎంపికకు సంబంధించిన మనకు ఉపయోగపడే వివిధ రకాల మెటీరియల్
Important documents for Reconstitution of PC Here
Thanks for reading Reconstitution of Parent Committees Guidelines/PC Schedule Guidelines.
No comments:
Post a Comment