Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 15, 2021

Thumb Rule 72: In how many years will your money double?


 Thumb Rule 72: మీ డబ్బు ఎన్నేళ్లలో రెట్టింపవుతుంది?

 మనం చాలా మార్గాల్లో పెట్టుబడి పెడుతుంటాం. అయితే, మనం పెట్టిన డబ్బులు రెట్టింపు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్న సందేహం చాలా సార్లు వస్తుంటుంది? ఉదాహరణకు మీరు సగటున 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్‌ ఫండ్లలో ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెడితే అది ఎన్ని ఏళ్లలో రెట్టింపు అవుతుంది? ఇలాంటి సందేహాలను తీర్చడం కోసం ఓ నిర్దిష్టమైన నియమం ఉంది. అదే థంబ్‌ రూల్‌ 72. దీని ద్వారా మీ డబ్బులు నిర్దిష్టమైన సమయంలో రెండింతలు కావాలంటే ఎంత శాతం రాబడి రావాలో కూడా తెలుసుకోవచ్చు!


ఏంటీ థంబ్‌ రూల్‌ 72..

ఇది బేసిక్‌గా ఓ సాధారణ గణిత సూత్రం. ఒక నిర్దిష్టమైన రాబడి ఇచ్చే పథకంలో మనం పెట్టే పెట్టుబడి ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందో చెబుతుంది. తెలుసుకోవాలంటే 72ని వచ్చే వడ్డీరేటుతో భాగిస్తే సరిపోతుంది. ఉదాహరణకు 5 శాతం రాబడి ఇచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రూ.లక్ష పెట్టారు. ఈ లక్ష రూపాయలు 2 లక్షలు కావడానికి ఎన్నేళ్లు తీసుకుంటుందో తెలియాలంటే 72ని 5తో భాగిస్తే సరిపోతుంది. (72/5) = 14.4 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ మీరు స్టాక్‌ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడి సగటున 10 శాతం రాబడి ఇస్తుంటే (72/10) 7.2 ఏళ్లలో మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలు అవుతుంది.

ఈ రూల్‌ను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు..

* ఈ సూత్రాన్ని రివర్స్‌ చేస్తే.. ఒక నిర్దిష్టమైన సమయంలో మన పెట్టుబడి రెట్టింపు కావాలంటే ఎంత రాబడి రావాలో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు మీ దగ్గరున్న డబ్బు ఐదేళ్లలో రెట్టింపు కావాలని అనుకుంటే.. 72ని ఐదుతో భాగించండి. (72/5) = 14.4. అంటే 14.4 శాతం రాబడి వస్తే మీ పెట్టుబడి ఐదేళ్లలో రెండింతలు అవుతుంది.


* ఇలా సమయం, వడ్డీ రేటు గనక తెలుసుకుంటే మీ ఆర్థిక అవసరాలకు సరిపడే పథకాలేంటో ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఒక రూ.10 లక్షలు పెట్టుబడిగా పెడదామని అనుకున్నారు. ఓ పదేళ్ల తర్వాత అది రెట్టింపు కావాలనుకుంటే థంబ్‌ రూల్‌ 72 ప్రకారం 7.2 శాతం రాబడి ఉండాలి. ఇలా 7.2శాతం రాబడినిచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదంటే మ్యూచువల్‌ ఫండ్లు ఏవో చూసుకొని వాటిలో పెట్టుబడి పెట్టొచ్చు.


* చిన్న వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే చిన్న వయసులోనే ఎక్కువ మొత్తంలో సంపాదించొచ్చని ఈ నియమం సూచిస్తుంది. అలాగే నష్టభయం అసలే ఉండొద్దని భావించేవారు.. తక్కువ రాబడి అయినా.. ఎక్కువ కాలం మదుపు చేస్తే సరిపోతుందని ఈ రూల్‌ చెబుతుంది.

ఇది కచ్చితమైన ఫలితాలు ఇస్తుందా..

ఇది 100 శాతం కచ్చితమైన ఫలితాలు ఇవ్వదు. కొంత తేడా ఉంటుంది. ఓ అంచనాకు రావడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.

Thanks for reading Thumb Rule 72: In how many years will your money double?

No comments:

Post a Comment