WhatsAPP: నవంబరు నుంచి ఈ ఫోన్ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు బంద్!
ఎప్పటిలానే వాట్సాప్ ఈ ఏడాది కూడా పాత ఫోన్లు ఉపయోగించే యూజర్స్‌కి తమ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 2021 నవంబరు 1 నుంచి కొన్ని పాత వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వెల్లడించింది. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కై 2.5.1 వెర్షన్ ఓఎస్‌లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్‌ఫోన్లలో నవంబరు 1 నుంచి వాట్సాప్ సెవ్యూరిటీ అప్‌డేట్‌లు, కొత్త ఫీచర్స్ ఈ ఫోన్లలో అప్‌డేట్ కావని తెలిపింది. దీనికి సంబంధించి ఫోన్ మోడల్స్‌లో జాబితాను వాట్సాప్ విడుదలచేసింది. మరి వాట్సాప్ విడుదలచేసిన ఫోన్ మోడల్స్ జాబితాలో మీరు ఉపయోగించే ఫోన్ ఉందేమో ఒక్కసారి చూసుకోండి.
ఐఫోన్
ఐఫోన్ ఎస్‌ఈ (మొదటి జనరేషన్)తోపాటు, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ మోడల్స్‌లో ఓఎస్ ఐఓఎస్ 10కి అప్‌డేట్ కాకుంటే సదరు ఫోన్ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ మోడల్స్‌కి ఐఓఎస్ 14 వెర్షన్ ఓఎస్‌ను సపోర్ట్ చేస్తాయని టెక్ నిపుణులు తెలిపారు. ఇప్పటికీ ఈ మోడల్స్‌లో ఓఎస్ అప్‌డేట్ చేయకపోతే వెంటనే ఐఓఎస్ 14 వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఆండ్రాయిడ్
ఆండ్రాయిడ్ ఫోన్ల జాబితాలో శాంసంగ్, ఎల్‌జీ వంటి ప్రముఖ బ్రాండ్‌లతోపాటు జడ్‌టీఈ, హువావే, సోనీ, హెచ్‌టీసీ మోడల్స్ ఉన్నాయి.
శాంసంగ్
శాంసంగ్ గెలాక్సీ ఎస్2, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ ట్రెండ్ II, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఏస్ 2, గెలాక్సీ ఎక్స్‌కవర్ 2. ఈ మోడల్స్ అమ్మకాలు భారత మార్కెట్లో నిలిచిపోయినప్పటకీ.. ఇప్పటికీ ఎవరైనా యూజర్స్ వీటిని ఉపయోగిస్తుంటే నవంబరు 1 నుంచి ఆయా మోడల్స్‌లో వాట్సాప్ పనిచేయదు.
ఎల్‌జీ
ఎల్‌జీ లూసిడ్ 2, ఆప్టిమస్ సిరీస్‌లో ఎఫ్7, ఎఫ్5, ఎల్3 II డ్యూయల్, ఎల్3 II, ఎల్4 II, ఎల్4 II డ్యూయల్, ఎల్5, ఎల్5 II, ఎల్5 డ్యూయల్, ఎల్7, ఎల్7 II డ్యూయల్, ఎల్7 II, ఎఫ్6, ఎఫ్3, ఎల్2 II, నిట్రో హెచ్‌డీ, 4ఎక్స్ హెచ్‌డీ, ఎఫ్3క్యూ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
జెడ్‌టీఈ
జెడ్‌టీఈ గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987, గ్రాండ్ మెమో, వీ956 మోడల్స్‌లో వాట్సాప్ తన సేవలను నిలిపివేయనుంది.
హువావే
హువావే అసెండ్ మేట్, అసెండ్ జీ740, అసెండ్ డీ క్వాడ్ ఎక్స్‌ఎల్, అసెండ్ డీ1 క్వాడ్ ఎక్స్‌ఎల్, అసెండ్ పీ1 ఎస్, అసెండ్ డీ2 మోడల్స్‌లో వాట్సాప్ పనిచేయదని వెల్లడించింది.
సోనీ
సోనీ ఎక్సీపీరియా మిరో, సోనీ ఎక్స్‌పీరియా నియో ఎల్, సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ ఎస్ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
వీటితోపాటు వికో డార్క్‌లైట్, ఆల్కాటెల్ వన్ టచ్ ఈవో7, ఆర్కోస్ 53 ప్లాటినం, క్యాటర్‌పిల్లర్ క్యాట్ బీ15, వికో సింక్ ఫైవ్, లెనోవా ఏ820, యూఎమ్‌ఐ ఎక్స్2, ఫయియా ఎఫ్1, టీహెచ్‌ఎల్ డబ్ల్యూ8, హెచ్‌టీసీ డిజైర్ 500 మోడల్స్‌లో వాట్సాప్ పనిచేయని ఫోన్ మోడల్స్ జాబితాలో ఉన్నాయి. ఒకవేళ పైన పేర్కొన్న జాబితాలో ఏదైనా మోడల్‌లో ఓఎస్ అప్‌డేట్ చేసుకునేందుకు అనుమతిస్తే అప్‌గ్రేడ్ చేసుకుని ఎప్పటిలానే వాట్సాప్ సేవలను పొందొచ్చని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Thanks for reading WhatsAPP: WhatsApp services on these phone models will be closed from November!
No comments:
Post a Comment