Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, September 12, 2021

WiFi Password: How To View WiFi Password On Android Phone?


 WiFi Password: ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో వైఫై పాస్‌వర్డ్ ఎలా చూడొచ్చంటే?

WiFi Password: How To View WiFi Password On Android Phone?

మీ ఇంటికి స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు ఇంట్లో వైఫైకి కనెక్ట్‌ అయ్యేందుకు పాస్‌వర్డ్‌ అడుగుతారు. అయితే చాలా వరకు హోం నెట్‌వర్క్‌లకు ఆటో కనెక్టివిటీ ఫీచర్ ఉంటుంది కాబట్టి మనం పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోం. పాస్‌వర్డ్‌ని ఎక్కడా నోట్ చేయం. అలానే ఇతరుల నెట్‌వర్క్‌కి మనం కనెక్ట్ కావాలన్నా పాస్‌వర్డ్ తెలుసుండాలి. అలాంటి సందర్భంలో పాస్‌వర్డ్ తెలుసుకునేందుకు ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కొన్ని సులువైన మార్గాలున్నాయి. ఒకవేళ మీరు పాస్‌వర్డ్‌ని మరిచిపోయినా ఈ కింది పద్ధతుల ద్వారా వైఫై పాస్‌వర్డ్‌ని తెలుసుకోవచ్చు. మరి అవేంటో ఒక్కసారి చూద్దాం. 


రౌటర్‌ పేజ్‌ లాగిన్‌ 

ఆండ్రాయిడ్ ఫోన్‌ సెట్టింగ్స్‌లో కనెక్షన్స్‌లోకి వెళ్లి వైఫై ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ ఫోన్ ఏ వైఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయిందో దాన్ని చూపిస్తుంది. నెట్‌వర్క్‌ పేరు పక్కనే ఉన్న సెట్టింగ్స్‌ని ఓపెన్ చేస్తే మేనేజ్ రౌటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే రౌటర్‌ పేజ్ ఓపెన్ అయి సైన్‌ఇన్ అడుగుతుంది. తర్వాత మీ రౌటర్ వెనుకవైపున ఉన్న సైన్ఇన్‌, పాస్‌వర్డ్ టైప్ చేసి లాగిన్ అయితే రౌటర్‌కి సంబంధించిన వెబ్‌పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో వైర్‌లెస్‌ సెక్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే నెట్‌వర్క్ కీ అని ఉంటుంది. అదే వైఫై పాస్‌వర్డ్‌.  


వైఫై యాప్స్‌

వైఫై పాస్‌వర్డ్‌ తెలుసుకునేందుకు ఉన్న మరో ఆప్షన్ వైఫై పాస్‌వర్డ్ కీ లేదా వైఫై ఫాస్‌వర్డ్ రికవరీ యాప్స్‌. ప్లేస్టోర్‌లో దీనికి సంబంధించిన యాప్స్ ఎన్నో ఉన్నాయి. ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యాప్‌ ఓపెన్‌ చేస్తే అది మీ వైఫై రౌటర్‌ కంపెనీల పేర్లు చూపిస్తుంది. అందులో మీ రౌటర్‌ పేరుపై క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వెబ్‌ పేజ్‌ని చూపిస్తుంది. అందులో మీ రౌటర్‌ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్ నమోదు చేసిన తర్వాత వైఫై సెక్షన్‌పై క్లిక్ చేసి మీ రౌటర్ పాస్‌వర్డ్ తెలుసుకోవచ్చు. 


క్యూ ఆర్‌ కోడ్ 

ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తర్వాత వైఫై పేరు పక్కన ఉన్న సెట్టింగ్స్‌ సింబల్‌పై క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్‌ చివర్లో మీకు క్యూఆర్‌ కోడ్ కనిపిస్తుంది. దాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవచ్చు. వాళ్లు దాన్ని స్కాన్‌ చేస్తే వైఫై పాస్‌వర్డ్ తెలుస్తుంది. అలానే మీ వైఫై క్యూఆర్‌ కోడ్‌ని ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో ఈ కోడ్ పేస్ట్‌ చేసినా సదరు వెబ్‌సైట్ మీ రౌటర్ వైఫై పాస్‌వర్డ్ చెప్పేస్తుంది. 


 ఐపీ అడ్రస్‌తో

ఇందులో మీ ఫోన్‌ వెబ్‌ బ్రౌజర్‌లో 192.168.0.1 లేదా 192.168.1.1 అనే ఐపీ అడ్రస్‌ టైప్ చేయాలి. తర్వాత మీ రౌటర్ వెబ్‌ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ రౌటర్ వెనుక ఉన్న యూజర్ నేమ్‌, పాస్‌వర్డ్ టైప్ చేసి వైర్‌లెస్‌ పేజ్‌లోకి వెళ్లి కిందకి స్క్రోల్ చేస్తే మీ నెట్‌వర్క్‌ కీ కనిపిస్తుంది. అదే మీ వైఫై పాస్‌వర్డ్. 

అయితే పైన పేర్కొన్న ఆప్షన్లు ఆండ్రాయిడ్ 10 ఆపై ఓఎస్‌లతో పనిచేసే ఫోన్లలో మాత్రమే పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 9 అంతకన్నా తక్కువ ఓఎస్‌తో పనిచేసే ఫోన్లలో కూడా వైఫై పాస్‌వర్డ్ చూడాలంటే మాత్రం మీ డివైజ్‌ రూట్‌ చేసుండాలి. ఇందులో సేవ్‌ చేసిన నెట్‌వర్క్ వైఫై వివరాలు ఫోన్ స్టోరేజ్‌లో భద్రపరిచి ఉంటాయి. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసేందుకు మీకు ఎలాంటి అనుమతి ఉండదు. ఒకవేళ మీ డివైజ్ రూట్ చేసుంటే ఫోల్డర్స్‌లో Data>MISC>wifi>wpa_supplicant.conf ఫైల్‌ని ఓపెన్ చేస్తే మీ నెట్‌వర్క్‌ పేరు (ssid), పాస్‌వర్డ్ (psk) కనిపిస్తాయి.

Thanks for reading WiFi Password: How To View WiFi Password On Android Phone?

No comments:

Post a Comment