Central Teacher Eligibility Test (CTET) December 2021: సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం.
ctet.nic.in: మొత్తం 20 భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. డిసెంబర్ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు ఈ పరీక్ష జరగనుంది.
ప్రధానాంశాలు:
సీటెట్ 2021 నోటిఫికేషన్ విడుదల
సెప్టెంబర్ 20 నుంచి రిజిస్ట్రేషన్లు
అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరితేది
సీటెట్ వల్ల ఉపయోగాలు
సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.
ఎవరు రాయొచ్చు ..
ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల(Students)కు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్- 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది .
పేపర్ 1 విద్యార్హత- పేపర్ -1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (Diploma In Education) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు రెండేళ్లు ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
ముఖ్య సమాచారం:
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.500. రెండు పేపర్లకు అయితే రూ.1200, రూ.600.
రిజిస్ట్రేషన్లు ప్రారంభం: 20.09.2021
దరఖాస్తులకు చివరితేదీ: 19.10.2021
PREVIOUS YEAR QUESTION PAPER DEC 2018
PREVIOUS YEAR QUESTION PAPER JULY 2019
PREVIOUS YEAR QUESTION PAPER DEC 2019
PREVIOUS YEAR QUESTION PAPER JAN 2021
వెబ్‌సైట్: https://ctet.nic.in/
Thanks for reading Central Teacher Eligibility Test (CTET) December 2021
No comments:
Post a Comment