Covaxin : చిన్నారులకు కోవిడ్ టీకా వచ్చేసింది .. కోవాగ్జిన్కు గ్రీన్ సిగ్నల్ ..
చిన్నారులకు దేశీయ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. 2-18 ఏళ్లలోపు పిల్లలకు కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా కీలక అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్‌లో చిన్నారులపై కోవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయిల్స్ పూర్తి కాగా.. వాటి సంబంధించిన ఫలితాలను వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ పరిశీలించింది. 18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ టీకాను వినియోగించేందుకు ఎక్స్‌పర్ట్ ప్యానల్ సిఫారసు చేసింది. దీనితో కేంద్రం అనుమతి పొందిన తొలి దేశీయ తీకాగా కోవాగ్జిన్ నిలిచింది.
కాగా, 2, 3 దశల్లో రెండు డోసుల కోవాగ్జిన్‌ను 525 మంది చిన్నారులపై భారత్ బయోటెక్ ప్రయోగాలు జరిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కోవాగ్జిన్ టీకాను 12 -18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిపై, 6-12 సంవత్సరాలు, అలాగే 2-6 సంవత్సరాల వారిపై మూడు దశల్లో ప్రయోగాలు జరిపారు. వైరస్‌ను ఎదుర్కోవడంలో కోవాగ్జిన్ ఎంతమేరకు ప్రభావితం చూపించిందన్న డేటా ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది.
వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను జోరుగా కొనసాగుతోంది. పెద్దవారికి మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ఉండడంతో చిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితిపై భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికీ వ్యాక్సిన్ ఏదీ అందుబాటులోకి రాకపోవడంతో అందరినీ కలవరపెట్టింది. టీకా తీసుకోకపోవడం..కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై అధిక ప్రభావం చూపెడుతుందని నిపుణుల హెచ్చరికలతో తల్లిదండ్రులు తీవ్రంగా భయపడిపోయారు. వారికి కూడా వ్యాక్సినేషన్ ఇప్పించేలా ఏర్పాట్లు చేయాలని పలువురు సూచిస్తున్నారు. ఇందుకనుగుణంగా…పలు కంపెనీలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి.
తాజాగా…చిన్నారులకు టీకా అందుబాటులోకి రానుంది. రెండు సంవత్సరాల నుంచి 18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డీసీజీఐ (DCGI) నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతినిచ్చింది. భారత్ బయోటెక్ పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరిపింది. మూడు వర్గాలుగా విభజించింది. తొలుత 2 నుంచి 6, రెండో దశ 6 నుంచి 12, మూడో దశ 12 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలపై ఈ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. పెద్దల్లో వచ్చిన ట్రయల్స్ ఫలితాలే…చిన్నారుల్లో కూడా వచ్చినట్లు ప్రాథమికంగా వెల్లడైంది.
మొదటగా 12 నుంచి 18 ఏళ్ల వయస్సు పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో భారత్ బయోటెక్ ఈ ట్రయల్స్ పూర్తి చేసింది. రెండు, మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందచేసింది. 2, 3 దశల్లో రెండు డోసుల వ్యాక్సిన్ ను 525 మంది చిన్నారులపై ప్రయోగించారు. ఆరోగ్య సమస్యలున్న చిన్నారులకు ముందుగా అవకాశం ఇవ్వనున్నారు. 20 రోజుల వ్యవధిలో రెండు డోస్ లు ఇవ్వనున్నారు. మొత్తంగా.. ప్రపంచంలో పసిపిల్లలకు తొలి టీకా అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చు.
Thanks for reading Covaxin: Children get Covid vaccine .. Green signal for covaxin ..
No comments:
Post a Comment