Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, October 3, 2021

Cyber Crime: Cellphone hacked ..


 Cyber Crime: సెల్‌ఫోన్‌ హ్యాక్‌ చేశారు.. రూ.25 లక్షలు ఊడ్చేశారు

సైబర్‌ నేరాల్లో తొలిసారి ఇలాంటిది

హాట్‌ మెయిల్‌ మెసేజ్‌లతో జర భద్రం

అప్రమత్తంగా ఉండకపోతే ఖాతాలు ఖాళీ



దోపిడీలకు ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ఎంచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు ఏకంగా సెల్‌ఫోన్‌నే హ్యాక్‌ చేసేశారు. హాట్‌ మెయిల్‌ ద్వారా సందేశం పంపిన సైబర్‌ నేరస్థులు ఓ వ్యక్తి ఫోన్‌ను హ్యాక్‌ చేసి అతని వ్యాలెట్‌ నుంచి రూ.25 లక్షలు కొట్టేశారు. సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ ప్రైవేటు ఉద్యోగి ఈ డబ్బు పోగొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు సైబర్‌ నేరగాళ్లు తొలిసారి సెల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. బాధితుడికి నేరగాళ్లు పంపించిన సందేశాల ఆధారంగా పోలీసులు మోసం జరిగిన తీరును విశ్లేషించారు. అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతారంటూ సెల్‌ఫోన్‌ వినియోగదారులను హెచ్చరిస్తున్నారు.

బహుమతుల పేరిట ఎస్‌ఎంఎస్‌లతో ఎర

సైబర్‌ నేరగాళ్లు.. మొదట సెల్‌ఫోన్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. లాటరీలు, బహుమతులు అని ఎర వేస్తూ వారి ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు. ఈ కేసులో బాధితుడికి కూడా ఇలాగే రెండు, మూడు ఎస్‌ఎంఎస్‌లు రాగా.. వాటిని యథాలాపంగా క్లిక్‌ చేశారు. వెంటనే ఆయన వివరాలన్నీ సైబర్‌ నేరగాడికి చేరిపోయాయి. ఇలా సెల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసిన ఆ నేరగాడు.. బాధితుడు బిట్‌ కాయిన్లను కొని వ్యాలెట్‌లో దాచుకున్నాడని గుర్తించాడు. ఆ వెంటనే 35 వేల అమెరికన్‌ డాలర్లను (దాదాపు రూ. 25 లక్షలు) బదిలీ చేసుకున్నాడు. ఆ లావాదేవీల వివరాలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లు, వ్యాలెట్‌ సందేశాలను అతడే ఫోన్‌లోంచి తొలిగించాడు. దీంతో బాధితుడు.. తన వ్యాలెట్‌లోని డాలర్లను కోల్పోయినట్లు వెంటనే గుర్తించలేకపోయారు. తర్వాత చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు ఓ ఎస్‌ఎంఎస్‌ యూఎస్‌ నుంచి, మరోటి ఆస్ట్రేలియా నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు.


హాట్‌ మెయిల్‌కు స్పందించొద్దు

హాట్‌ మెయిల్‌ ద్వారా వచ్చే సందేశాలకు స్పందించవద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. జీమెయిల్‌, యాహూ మెయిల్‌ ఖాతాల్లా హాట్‌ మెయిల్‌ ఖాతాలను ప్రారంభిస్తున్న నేరస్థులు అందులోకి టోర్‌టీ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారని వివరించారు. దాని సాయంతోనే సెల్‌ఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారన్నారు. వీరు కార్పొరేటు, ప్రైవేటు సంస్థల రహస్య వివరాలను కూడా సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు.

Thanks for reading Cyber Crime: Cellphone hacked ..

No comments:

Post a Comment