Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, October 11, 2021

Dengue: The spread of dengue is constantly increasing.


 Dengue : డెంగ్యూ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది .. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే నివారించవచ్చు ..


Dengue : దేశంలోని అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ వేగంగా విస్తరిస్తోంది. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండటం, తమ కుటుంబాన్ని దాని నుండి సురక్షితంగా ఉంచడం ఆవశ్యకం అయింది.డెంగ్యూ లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా దానిని సులభంగా నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా చలితో అధిక జ్వరం కలిగి ఉంటే అప్పుడు కచ్చితంగా రక్త పరీక్ష చేయించుకోవాలి. పరీక్షలో డెంగ్యూ నిర్ధారణ అయినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


ఈ సీజన్‌లో ప్రతి సంవత్సరం డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్ యుధ్వీర్ సింగ్ చెప్పారు. చాలా మంది రోగులు తేలికపాటి రోగలక్షణాలతో ఉంటారు. ఒకటి లేదా రెండు వారాలలో కోలుకుంటారు. కొన్ని సందర్భాల్లో రోగి పరిస్థితి విషమంగా ఉంటుంది. చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరికైనా డెంగ్యూ వచ్చినట్లయితే వారు జాగ్రత్తగా ఉండాలి.

ఫోర్టిస్ హాస్పిటల్ క్రిటికల్ కేర్ విభాగానికి చెందిన డాక్టర్ రిచా షారిన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా మంది డెంగ్యూ, మలేరియా రోగులు ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. ఈ రోగులలో అధిక జ్వరం, వాంతులే, విరేచనాల సమస్యలు కూడా కనిపిస్తున్నాయన్నారు. నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం రోగులకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు.

మీకు ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే పరీక్షలు చేయించుకోండి..

సరైన సమయంలో డెంగ్యూ లక్షణాలను గుర్తించి చికిత్స చేయడం ద్వారా ఈ వ్యాధిని సులభంగా నియంత్రించవచ్చని డాక్టర్ రిచా చెప్పారు. ఆ డాక్టర్ ప్రకారం.. డెంగ్యూ లక్షణాలు కింది విధంగా ఉంటాయి.

చలితో అకస్మాత్తుగా అధిక జ్వరం రావడం, కండరాలు, తల, కీళ్లలో నొప్పి, కళ్ల వెనుక నొప్పి, తీవ్ర బలహీనత, ఆకలి కోల్పోవడం, వికారంగా ఉండడం, వాంతులు అవుతుండడం, నోటిలో దుర్వాసన, రుచి లేకపోవడం.. వంటి లక్షణాలు డెంగ్యూ వచ్చిన వారిలో కనిపిస్తాయి.


నివారణ

ఇంటిలోపల, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుంగా చూసుకోవాలి. ముఖ్యంగా కూలర్లు, కుండలు, విరిగిన పాత్రలు, పాత టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. అలాగే వాటర్ ట్యాంక్, ఇంట్లో నీళ్లు తాగే బిందె, కుండ, ఇతర పాత్రలను సరిగ్గా కవర్ చేయాలి. మూతలను కప్పి ఉంచాలి. కిటికీ తలుపులపై దోమలు రాకుండా జాలి పెట్టండి.


దోమల నుండి రక్షించడానికి శరీరాన్ని ఎక్కువగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. ఫ్రిజ్ దిగువన నీటి సేకరణ ట్రేని ఖాళీ చేస్తూ ఉండాలి. తాజాగా తయారుచేసిన ఆహారాన్ని తినాలి. నిల్వ ఉంచిన ఆహారం తినరాదు. ఈ విధంగా జాగ్రత్తలను పాటిస్తే డెంగ్యూ రాకుండా ముందుగానే నివారించవచ్చు.

Thanks for reading Dengue: The spread of dengue is constantly increasing.

No comments:

Post a Comment