IIT Admissions: JEE రాయకుండానే ఐఐటీలలో అడ్మిషన్ పొందవచ్చు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో చదవాలంటే ఇంజనీరింగ్ మాత్రమే ఎంపిక చేసుకొని.. కేవలం జేఈఈ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఐఐటీల్లో ఇతర కోర్సులు కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి ఐఐటీల్లో చదవాలనే కలను నెరవేర్చుకోవచ్చు. ఆ కోర్సులు ఏవో.. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏంటో తెలుసుకుందాం.
భారతదేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో చేరాలనే కల చాలామంది విద్యార్థులు ఉంటుంది. తమ కలను నెరవేర్చుకునేందుకు ఏటా లక్షల మంది విద్యార్థులు ఐఐటీ అర్హత పరీక్ష అయిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు హాజరవుతున్నారు. కానీ వారిలో 10 వేల మంది విద్యార్థులే ఐఐటీల్లో సీటు దక్కించుకోగలుగుతున్నారు. జేఈఈ (JEE) అడ్వాన్స్‌డ్ పరీక్ష ద్వారా ఐఐటీల్లో సీటు సంపాదించడం చాలా కష్టం కావడమే ఇందుకు కారణం. అయితే ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో చదవాలంటే ఇంజనీరింగ్ మాత్రమే ఎంపిక చేసుకొని.. కేవలం జేఈఈ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఐఐటీల్లో ఇతర కోర్సులు కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి ఐఐటీల్లో చదవాలనే కలను నెరవేర్చుకోవచ్చు. ఆ కోర్సులు ఏవో.. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏంటో తెలుసుకుందాం.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ (గేట్)
గేట్ పరీక్షను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) బెంగుళూరు & బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీలు అనే ఏడు ఐఐటీలు కలిసి నిర్వహిస్తాయి. ఐఐటీల్లో మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చదువు పూర్తి చేయాలనుకునే ఆసక్తి ఉన్న విద్యార్థులు గేట్ పరీక్షకు హాజరు కావచ్చు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-పీహెచ్‌డీ, పీహెచ్‌డీ, ఇంజనీరింగ్, అనుబంధ విభాగాలలో ప్రవేశం పొందవచ్చు. ప్రాథమిక శాస్త్రాల (basic sciences) నుంచి ఇంజనీరింగ్ వరకు మొత్తం 25 విభాగాలకు గేట్ పరీక్షను నిర్వహిస్తారు. మీరు అండర్ గ్రాడ్యుయేషన్ లో చదువుకున్న సబ్జెక్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. ఈ పరీక్ష 65 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (MCQ)లతో మూడు గంటల పాటు జరుగుతుంది.
కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)
ఈ ఆన్‌లైన్ పరీక్షను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లలో (IIMs) బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. అయితే ఐఐటీలు కూడా క్యాట్ (CAT) ఎగ్జామ్ స్కోర్‌ల ఆధారంగా తమ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల కోసం అభ్యర్థులకు అడ్మిషన్లు కల్పిస్తాయి. ఈ పరీక్షలో వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (VARC), డేటా ఇంటర్‌ప్రెటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (DILR), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (QA) అనే 3 సెక్షన్లు ఉంటాయి.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR-NET)
ఐఐటీల ఫ్యాకల్టీ సభ్యులు లేదా నిపుణులు, యూనివర్సిటీ విభాగాల నిపుణులు, సైన్స్ వివిధ రంగాలకు చెందిన జాతీయ ప్రయోగశాలల నిపుణుల గైడెన్స్ లో శిక్షణ పొందాలనుకునే విద్యార్థులు సీఎస్ఐఆర్-ఎన్ఈటీ (CSIR-NET) ఎగ్జామ్ రాయవచ్చు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు పరిశోధన ఫెలోషిప్ (research fellowship) లభిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF)కు క్వాలిఫై అయిన అభ్యర్థులు లెక్చరర్‌షిప్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హులు సాధిస్తారు.
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (JAM)
ఈ పరీక్షను బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జియాలజీ, బయోలాజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అనే 7 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా ఐఐటీలు ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం కోర్సులను అందిస్తున్నాయి . ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc, బెంగళూరు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISERs), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NISER, భువనేశ్వర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్, టెక్నాలజీ (NITs) ఇతర సంస్థల్లో ఎమ్మెస్సీ కోర్సులలో ప్రవేశం పొందొచ్చు.
హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (HSCEE)
ఈ పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్ ద్వారా విద్యార్థులు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ స్ట్రీమ్‌లో డెవలప్‌మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, ఫిల్మ్ స్టడీస్, హెల్త్ స్టడీస్, హిస్టరీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫిలాసఫీ, పాలిటిక్స్, సోషియాలజీ వంటి వివిధ విభాగాల్లో ఐఐటీలు కోర్సులు అందిస్తున్నాయి.
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT)
మొత్తం 23 ఐఐటీ సంస్థలలో కేవలం ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur), ఐఐటీ రూర్కీ మాత్రమే బీఆర్క్ (BArch) కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి అభ్యర్థి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పేపర్‌లలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే ఐఐటీ జేఈఈ పరీక్ష జాయింట్ అడ్మిషన్ బోర్డ్ నిర్వహించే ఏఏటీ(AAT) ని కూడా క్లియర్ చేయాలి.
వీటితో పాటు కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ఐఐటీలు బీఎస్సీ లేదా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సర్టిఫికేట్ కోర్సులు, అనేక ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి.
Thanks for reading IIT Admissions: You can get admission in IITs without writing JEE .. There are alternative ways ..
No comments:
Post a Comment