Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, October 25, 2021

Mega Job Fair on October 30 in AP - 22 top companies - over a thousand jobs.


 ఏపీలో అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా- 22 టాప్ కంపెనీలు- వెయ్యికి పైగా ఉద్యోగాలు.

ఏపీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వివిధ జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈ నెల 30న మరో మెగా జాబ్ మేళా జరగబోతోంది.

ఈ నెల 30న నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇవాళ ప్రకటించారు. ఇందులో 22 ప్రముఖ కంపెనీలు పాల్గొనబోతున్నట్లు ఆయనత తెలిపారు. ఇందులో హీరో, ఇసుజు, అమరరాజా బ్యాటరీస్, బజాజ్, హ్యుందయ్, అపాచీ, ఫ్లిప్ కార్ట్, టాటా స్టీల్, అపోలో, మెడికవర్,హెటెరో ఫార్మా వంటి పేరున్న కంపెనీలలో ఉద్యోగాలు పొందే ఛాన్స్ ఉందన్నారు.

ఈ జాబ్ మేళా ద్వారా వెయ్యికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. కరోనా సంక్షోభం అనంతరం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు నిరుద్యోగులకు, యువతకు సువర్ణావకాశం దక్కుతుందని ఆయన తెలిపారు. మరో వారం రోజుల్లో మెగా జాబ్ మేళా జరగనుండటంతో ఉద్యోగార్ధులకు తెలిపేందుకు ఈ వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 30వ తేదీ, శనివారం నాడు మంత్రి మేకపాటి ముఖ్య అతిథిగా ఈ ఉద్యోగ మేళా ప్రారంభం కానుంది. మంత్రి మేకపాటి సొంత నియోజకవర్గం ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా జరిగే మరో భారీ జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆహ్వానం పలుకుతోంది.

ఇందులో పాల్గొని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మేకపాటి పిలుపునిచ్చారు. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారు, కొత్తగా కొలువు కోరుకొనే ఆత్మకూరు నియోజకవర్గ యువతీ యువకులు, నెల్లూరు జిల్లా నిరుద్యోగులూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు www.apssdc.in ద్వారా తమ వివరాలు ముందుగానే నమోదు చేసుకోవాలి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బిటెక్, డిప్లమా ఇన్ మెడికల్, ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ విద్యనభ్యసించిన వారందరూ ఈ మేళాలో పాల్గొనవచ్చు. అభ్యర్థుల వివరాలతో కూడిన సీవీ, రెజ్యుమ్ లతో పాటు విద్యార్హతలకు సంబంధించిన ధవపత్రాలు. ఆధార్ కూడా తప్పనిసరి ఉండాలి.

Thanks for reading Mega Job Fair on October 30 in AP - 22 top companies - over a thousand jobs.

No comments:

Post a Comment