Modi: జాతినుద్దేశించి నేడు మోదీ ప్రసంగం
దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్ చేసింది.దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భాన్ని పురస్కరించుకుని మోదీ ప్రసంగించే అవకాశముంది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రస్థానం జనవరి 16న మొదలై.. 279వ రోజున శతకోటి మలుపు చేరుకొంది. దీంతో నిత్యం సగటున 35,84,223 మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించినట్టయింది. ఇప్పటివరకూ సుమారు 70% మందికి ఒక డోసు, 31% మందికి రెండు డోసులు పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
Thanks for reading Modi: Modi's speech today addressed to the nation
No comments:
Post a Comment