Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, October 31, 2021

November: New rules from November 1 ...


November : నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు .. గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే ..



November: సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి పలు అంశాలలో నిబంధనలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, తదితర అంశాలలో నిబంధనలు మార్పులు ఉంటాయి.

ఇక అక్టోబర్‌ నెల ముగిసింది. నవంబర్‌ నెల ప్రారంభమైంది. ఈ నెలలో పలు అంశాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కొత్త నిబంధనలు నవంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకు, రైల్వేలు, గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు వంటివి ఇందులో ఉన్నాయి. ఎలాంటి మార్పులు ఉన్నాయో తెలుసుకుందాం.


రైళ్ల సమయ వేళలు..

భారతీయ రైల్వేలు దేశంలోని రైళ్ల సమయ వేళలు మార్చబోతున్నాయి. కొత్త టైమ్ టేబుల్ అక్టోబర్ 1 నుంచి అమలు కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఇప్పుడు 13 వేల ప్యాసింజర్ రైళ్లు, 7 వేల గూడ్స్ రైళ్ల సమయ వేళలు మారబోతున్నాయి. నవంబర్ 1వ తేదీ నుంచి దాదాపు 30 రాజధాని రైళ్ల వేళలు కూడా మారనున్నాయి.


గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన సమీక్షించబడతాయని అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత కొత్త రేట్లు జారీ చేస్తారు. కమర్షియల్ , డొమెస్టిక్ సిలిండర్ల కొత్త రేట్లు ప్రతి నెల 1వ తేదీన జారీ చేయబడతాయి. ఒక వేళ తగ్గొచ్చు.. పెరగొచ్చు.. లేదా నిలకడగా ఉండవచ్చు. అలాగే ఈ నెలలో కూడా గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు చెబుతున్నారు.


బ్యాంకు సెలవులు

ఇక ప్రతి నెల రాగానే బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటారు. ఎందుకంటే చాలా మంది ప్రతి రోజు బ్యాంకులకు సంబంధించి పనులు చేసుకుంటారు. బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే ముందుగానే ప్లాన్‌ చేసుకోవచ్చు. ఈనెలలో 17 రోజులు సెలవులు ఉండనున్నాయి. వీటిలో 11 రోజులు ఆర్బీఐ క్యాలెండర్ జాబితా ప్రకారం సెలవులు కాగా, మిగిలినవి వారాంతాల్లో ఉన్నాయి. ఇవి దేశ వ్యా్ప్తంగా ఉండే సెలవులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల పాటు సెలవులు వచ్చాయి.


ఈ మొబైల్‌లలో వాట్సాప్ పనిచేయదు

పలు మొబైల్‌లలో వాట్సాప్‌ నిలిచిపోనుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్ రెండింటి పాత వెర్షన్‌లకు సపోర్ట్ చేయదని వాట్సాప్ వెల్లడించింది. మెసేజింగ్ యాప్‌ని Android OS 4.1, అంతకంటే ఎక్కువ, iOS 10 , అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే ఉపయోగించవచ్చు. వీటిలో శాంసంగ్‌ గెలక్సీ, గెలక్సీ ట్రెండ్‌ లైట్‌, గెలక్సీ SII, గెలక్సీ ట్రెండ్‌ II, గెలక్సీ S3 Mini, గెలక్సీ Core, గెలక్సీ Xcover 2 వంటివి ఉన్నాయి.


పెన్షనర్లకు ఎస్‌బీఐ ఊరట..

ఇక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెన్షనర్లకు ఊరట కల్పించింది. లైఫ్‌ సర్టిఫికేట్‌ సమర్పించేందుకు ఫించన్‌దారులు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండా వీడియో కాల్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది. నవంబర్‌ 1వ తేదీ నుంచి ఈ సేవలను ఎస్‌బీఐ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నిర్ణయం వృద్ధులకు పెద్ద ఊరట అనే చెప్పాలి.


బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త ఛార్జీలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకులో నిబంధనలు మారాయి. డబ్బులు డిపాజిట్‌, విత్‌డ్రా చేయడానికి కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టబోతోంది సదరు బ్యాంకు. అయితే వాస్తవానికి, నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ బ్యాంకింగ్ సేవను ఉపయోగించినందుకు మీరు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు.. రుణ ఖాతాకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారుడు నాలుగోసారి డబ్బులు డిపాజిట్ చేస్తే రూ.40 చార్జీ విధిస్తారు. మీ జన్ ధన్ ఈ బ్యాంకులో ఉంటే, డబ్బు డిపాజిట్ చేయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు. కానీ ఉపసంహరణపై 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Thanks for reading November: New rules from November 1 ...

No comments:

Post a Comment