WhatsApp: వాట్సాప్ ఖాతా బ్లాక్ కాకూడదంటే.. ఇలా చేయoడి?
సామాజిక మాధ్యమాలు వినియోగంలో మనం తెలిసో తెలియక చేసే పోస్ట్‌లు మనల్ని చిక్కుల్లో పడేస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లో కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ఖాతాలు డిలీట్ లేదా బ్లాక్ అవుతుంటాయి. ఇందుకు ప్రధాన కారణం వాట్సాప్ రక్షణ వ్యవస్థ. వాట్సాప్ ద్వారా జరిగే మోసాలు, వేధింపులకు అడ్డుకునేందుకు, యూజర్స్ డేటాకు మెరుగైన భద్రతను అందించేందుకు కంపెనీ నియమనిబంధనలను రూపొందించింది. వాటిని అతిక్రమించిన యూజర్స్ ఖాతాలను వాట్సాప్ డిలీట్ లేదా బ్లాక్ చేస్తుంది. అయితే వాట్సాప్ చర్యలు తీసుకునే ఖాతాల్లో కొన్ని ఉద్దేశపూర్వకంగా జరిగినవి కాగా, కొన్ని ఖాతాలు అవగాహనారాహిత్యం వల్ల జరిగేవని సైబర్ నిపుణులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులోనే వాట్సాప్ సుమారు 20 లక్షల భారతీయుల ఖాతాలను బ్యాన్ చేసింది. అంతకుముందు నెలలో సుమారు 30 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మీ ఖాతాను బ్యాన్ లేదా డిలీట్ చేయకుండా ఉండేందుకు ఏం చేయకూడదో తెలుసుకుందాం.
థర్డ్‌పార్టీ యాప్స్ జోలికెళ్లొద్దు
సాధారణ వాట్సాప్‌కు భిన్నంగా వేర్వేరు పేర్లతో వివిధ రకాల వాట్సాప్ యాప్‌లు ప్లేస్టోర్, యాప్‌స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధరాణ వాట్సాప్ వెర్షన్‌కి భిన్నంగా ఉంటాయి. వీటికి వాట్సాప్ నుంచి ఎలాంటి అనుమతి ఉండదు. ఇవి సాధారణ వాట్సాప్‌లో ఉండే ఫీచర్స్‌కి భిన్నంగా కొన్ని అదనపు ఫీచర్స్‌ని అందిస్తాయి. అయితే ఈ ఫీచర్స్ వాట్సాప్ నియమనిబంధనలకు విరుద్ధం. అందుకే జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్, వాట్సాప్ మోడ్ వంటి పేర్లతో ఉండే వాట్సాప్ యాప్‌లను ఉపయోగించకూడదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ ఈ యాప్‌ల ద్వారా మీరు ఖాతాను ఉపయోగిస్తే వాట్సాప్ మీ ఖాతాను బ్యాన్ చేసే అవకాశం ఉంది. అందుకే వాట్సాప్ మోడిఫైడ్ యాప్స్ జోలికెళ్లకపోవడం ఉత్తమం.
స్పామ్ మెసేజెస్‌పై ఫిర్యాదు చేస్తున్నారా?
అవతలి వారి అనుమతి లేకుండా ప్రైవేటు ఛాట్ ద్వారా మీరు ప్రమోషనల్ మెసేజెలు, బిజినెస్ మెసేజెలు పంపుతుంటే మీ ఖాతాపై వాట్సాప్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది తమకు తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు, అనవసరమైన మెసేజ్‌లపై వాట్సాప్‌కు స్పామ్ మెసేజ్ అని ఫిర్యాదు చేయొచ్చు. దానివల్ల వాట్సాప్ మీ ఖాతాపై చర్యలు తీసుకుంటుంది. అందుకే ప్రమోషన్ లేదా బిజినెస్‌కు సంబంధించిన మెసేజ్‌లు పంపే ముందు, ఇతరుల అనుమతి లేకుండా గ్రూప్‌లో సభ్యులుగా చేర్చే ముందు వారి అనుమతి తీసుకోవడం మంచిది. లేదంటే వాట్సాప్ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తీసుకునే చర్యల వల్ల మీ ఖాతా బ్లాక్ లేదా డిలీట్ అవుతుంది.
వాట్సాప్ ఖాతా బ్లాక్ అయితే ఏం చేయాలి?
ఒకవేళ మీరు తెలియక చేసిన పొరపాటు వల్ల వాట్సాప్ ఖాతా బ్లాక్ అయితే కొంత సమయం తర్వాత దానంతటదే యాక్టివేట్ అవుతుంది. అయితే మీ ఖాతా బ్లాక్ అయిన వెంటనే మీరు వాట్సాప్‌కి అప్పీల్ చేయాల్సి ఉంటుంది. అలానే వాట్సాప్ సపోర్ట్‌కి బ్యాన్ చేయడం సరైన చర్య కాదని వివరిస్తూ మెయిల్ చేయొచ్చు. మీ అభ్యర్థనను పరిశీలించి, మీరు పేర్కొన్న కారణాలు సరైనవి అని వాట్సాప్ భావిస్తే వెంటనే ఖాతాను యాక్టివేట్ చేస్తుంది.
Thanks for reading whatsApp: WhatsApp account should not be blocked .. Do this?
No comments:
Post a Comment