Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, November 27, 2021

Alert: These are the rules that will change from December 1 ....


 అలెర్ట్: డిసెంబర్ 1 నుండి మారనున్న రూల్స్ ఇవే....

నవంబర్ నెల ముగియడానికి  మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. తరువాత ఈ సంవత్సరంలో చివరి నెల డిసెంబరు నెల మొదలవుతుంది కాబట్టి మీ సేవింగ్స్ (savings)పై భారాన్ని పెంచే  మార్పుల గురించి తెలుసుకోండి. 

ఒకవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు షాక్ ఇస్తుండగా, మరోవైపు ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలు కూడా మారనుంది. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ నుండి  కొన్ని కొత్త నియమాలు వర్తిస్తాయి. ఈసారి ప్రజల ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉండబోతోందో చూద్దాం...

ఎస్‌బి‌ఐ క్రెడిట్ కార్డ్‌ వినియోగం 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే వారికి డిసెంబర్  నెలలో ఖర్చులు పెరుగుతాయి. వాస్తవానికి డిసెంబర్ 1 నుండి ఎస్‌బి‌ఐ (SBI) క్రెడిట్ కార్డ్‌ ఈ‌ఎం‌ఐ(EMI)తో కొనుగోలు చేయడం ఖరీదైనదిగా మారనుంది. ప్రస్తుతం ఎస్‌బి‌ఐ కార్డులపై వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నారు. అయితే ఇక నుంచి ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయనున్నారు. దీంతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం, క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసిన తర్వాత ఈ‌ఎం‌ఐ ఆప్షన్ కింద చెల్లింపులు చేయడానికి మీరు ప్రతి కొనుగోలుపై ప్రత్యేకంగా రూ.99 అదనపు ఛార్జీని చెల్లించాలి. ఇది ప్రాసెసింగ్ ఛార్జ్ అవుతుంది. ఈ నియమాన్ని ఎస్‌బి‌ఐ స్వయంగా మొదట ప్రారంభించింది. 

గ్యాస్ ధరలలో మార్పులు

ప్రతి నెల 1వ తేదీన  ఎల్‌పి‌జి/వాణిజ్య సిలిండర్ల కొత్త ధరలు జారీ చేయబడతాయని గుర్తించుకోవాలి. ఎల్‌పి‌జి ధరలను సమీక్షించిన తర్వాత కంపెనీలు ప్రతినెల ప్రారంభంలో వీటిని సవరిస్తాయి. సమీక్షించిన తర్వాత సిలిండర్ ధర పెరగడం లేదా తగ్గే అవకాశం ఉండవచ్చు. అందుకే సామాన్య ప్రజలు కూడా  ప్రతినెల 1వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఎల్‌పి‌జి గ్యాస్ సిలిండర్ ధరలు యధాతదంగా కొనసాగే అవకాశం ఉంది. 

గృహ రుణాలు

సొంత ఇంటి కల కోసం ఎల్‌ఐసి హౌసింగ్ నుండి హోమ్ లోన్ తీసుకొని కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి చేదు వార్త. నవంబర్ 30 తర్వాత గృహ రుణాలు ఖరీదైనది కానున్నాయి. నిజానికి చాలా బ్యాంకులు పండుగ సీజన్‌లో గృహ రుణాలపై ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఆఫర్‌లో తక్కువ వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ ఎల్‌ఐ‌సి హౌసింగ్ ఫైనాన్స్ ఆఫర్ నవంబర్ 30తో ముగుస్తుంది. అయితే చాలా బ్యాంకుల ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు కొనసాగించాయి.  

యూ‌ఏ‌ఎన్ ఆధార్‌తో లింక్ చేయకపోతే

యూ‌ఏ‌ఎన్ (UAN) ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి నవంబర్ 30 చివరి తేదీ. దీనికి సంబంధించి నివేదికలను విశ్వసిస్తే నవంబర్ 30 వరకు పొడిగించింది. ఇలాంటి సమయంలో త్వరలో మీ యూ‌ఏ‌ఎన్ ని ఆధార్‌తో లింక్ చేయండి లేకపోతే మీ పి‌ఎఫ్ ఖాతాలోని డబ్బు జమ ఆగిపోవచ్చు.

Thanks for reading Alert: These are the rules that will change from December 1 ....

No comments:

Post a Comment