BSNL Recharge: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.599తో అన్‌లిమిటెడ్ డేటా!
ఇటీవల ప్రైవేటు టెలికాం సంస్థలు టారిఫ్ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వినియోగదారులకు ఆకట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. తక్కువ ధరలోనే ఎక్కువ డేటాతో పాటు కొన్ని దీర్ఘకాల ప్లాన్‌లను తీసుకొచ్చింది.
అన్ని ప్లాన్లలోకెల్లా రూ.599 అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ప్లాన్ తీసుకున్నవారికి ప్రతిరోజు 5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు అందుతాయి. వీటితో పాటు జింగ్‌మ్యూజిక్‌ను ఉచితంగా ఆనందించవచ్చు. ఇక అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు అన్‌లిమిటెడ్ డేటా అందిస్తోంది. ఇన్ని ఆఫర్లు ఉన్న ప్లాన్ కాలపరిమితి ఏ 28 రోజులో, 36 రోజులో అనుకుంటే పొరపాటే. 84ల రోజు వ్యాలిడిటీతో ఇవన్నీ అందనున్నాయి. ఈ ధరలో ఈ స్థాయి ఫీచర్లు ఉన్న ప్లాన్ మరే టెలికాం సంస్థ అందించడం లేదనే చెప్పాలి.
ఇక దీర్ఘకాల ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి...
* రూ.2,399; కాలపరిమితి- 425 రోజులు; వాయిస్ కాల్స్- అపరిమితం; డేటా- రోజూ 3జీబీ; ఎస్‌ఎంఎస్‌లు- రోజూ 100; ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్
* రూ.1,999; కాలపరిమితి- 365 రోజులు; వాయిస్ కాల్స్- అపరిమితం; డేటా- 600 జీబీ; ఎస్‌ఎంఎస్‌లు- రోజుకు 100; ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, 60 రోజుల వరకు వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్, ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్
* రూ.1,999; కాలపరిమితి- 180 రోజులు; వాయిస్ కాల్స్- అపరిమితం; డేటా- రోజూ 3 జీబీ; ఎస్‌ఎంఎస్‌లు- రోజుకు 100; 60 రోజుల వరకు ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్
Thanks for reading BSNL Recharge: BSNL Bumper Offer with Rs. 599 Unlimited Data!
No comments:
Post a Comment