Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 17, 2021

Christmas and Sankranthi holidays ...


క్రిస్మస్, సంక్రాంతి సెలవులివే...

 ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు

రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆ ఈర్టీ) అకడమిక్ క్యాలెండర్లో పొందు పరిచింది. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయి. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. డిసెంబర్ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని ఎస్సీఈఆర్టీ వివరించింది. మిషనరీ పాఠశాలలకు మినహా తక్కిన పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. 17వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. జనవరి 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ సెలవే.

క్రిస్ మస్ /సంక్రాంతి వెనుక ముందు సెలవు పెట్టుకోవచ్చునా ?

సంక్రాంతి,దసరా సెలవులకు suffix, Prefix ఉండవు. అంటే ఎన్ని రోజులు ఇచ్చినా TERMINAL HOLIDAYS కావు. కాబట్టి ఈ సారి 

సంక్రాంతి సెలవులు : 👇

(08-01-2022-----16-01-2022 (9రోజులు)

క్రిస్ మస్ సెలవులు : 👇

(23-12-2021----30-12-2021(8రోజులు)

అంటే సెలవులు 10 రోజులకు మించలేదు(9రోజులు). కావున ఏవరికైన అత్యవసరమైన యెడల సెలవులు ప్రారంభానికి ముందురోజు కాని, సెలవులు పూర్తి అయిన తరువాత రోజు కాని సెలవు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చును. ఏదైనా సెలవులు 10రోజులు మించరాదు.10రోజులు మించినట్లైతే అది ELIGIBLE LEAVE గా పరిగణిస్తారు. SUMMAR HOLIDAYS మాత్రమే TERMINAL HOLIDAYS.

Thanks for reading Christmas and Sankranthi holidays ...

No comments:

Post a Comment