Today AP:Covid-19 Media bulletin
03.01.22
31.12.21
30.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 33,188 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 130 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 97 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,081 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
27.12.21
అమరావతి: ఏపీలో మరో 54మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24గంటల్లో 17,940 శాంపిల్స్ పరీక్షించగా.. 54మందిలో వైరస్ వెలుగుచూసినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. కొత్తగా ఎటువంటి మరణాలూ సంభవించలేదని తెలిపారు. తాజాగా 121మంది కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1099 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో వెల్లడించారు. తాజాగా నమోదైన 54 కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 19, విశాఖలో 13 కేసులు వచ్చాయని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,11,99,604 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 20,76,546మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 20,60,957మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 14,490మంది కరోనా కాటుకు బలైపోయారు.
26.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 25,086 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 82 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 164 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,166 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
25.12.21
AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 104 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో ప్రకటించింది.అదే సమయంలో కోవిడ్ నుంచి 133 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,249 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,410కి చేరింది. వీరిలో 20,60,672 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఏపీలో గత 24 గంటల్లో కోవిడ్ వల్ల నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,489కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.ఇప్పటివరకు రాష్ట్రంలో 3,11,56,578 శాంపిల్స్ పరీక్షించారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
24.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 29,801 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న కృష్ణాలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 139 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,279 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
ఏపీలో ఇవాళ మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన విశాఖ, తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన 41 ఏళ్ల మహిళతో పాటు విశాఖకు చెందిన 33 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ కార్యాలయం వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ ఈనెల 19న కువైట్ నుంచి.. విశాఖకు చెందిన వ్యక్తి ఈనెల 15న యూఏఈ నుంచి వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం ఇరువురూ క్వారంటైన్ ఉన్నారని.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి 53 మంది వచ్చారని.. వారిలో 9 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామన్నారు. రాష్ట్రంలో తాజాగా నమోదైన రెండింటితో కలిపి ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకి చేరింది.
23.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 31,158 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 135 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 164 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,326 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
22.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 28,670 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 103 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న ఇద్దరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 175 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,358 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
రెండో ఒమిక్రాన్ కేసు నమోదు...
ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 39 ఏళ్ల సదరు మహిళ ఈనెల 12న కెన్యా నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకున్న మహిళ నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఆమెకు ఒమిక్రాన్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అయితే ఆ మహిళ కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్ వచ్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదైన విషయం తెలిసిందే.
21.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 27,233 పరీక్షలు నిర్వహించగా.. 95 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,481కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 179 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,061 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1,432 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
20.12.21
19.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 29,643 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 121 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న కృష్ణాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 228 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,597 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
18.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 31,855 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 137 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న విశాఖపట్నంలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 189 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,705 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
16.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,043 పరీక్షలు నిర్వహించగా.. 148 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ వల్ల చిత్తూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,474కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 152 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,59,131 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1,821 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
15.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 35,071 పరీక్షలు నిర్వహించగా.. 163 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ వల్ల నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,471కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 162 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,979 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1,821 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
14.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 29,228 పరీక్షలు నిర్వహించగా.. 132 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,468కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 186 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,817 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1,823 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
13.12.21
AP Covid Update : ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో కొత్తగా 108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 141 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,878 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,976 కి చేరింది. వీరిలో 20,58,631మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,467కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో3,07,98,406 శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు లేవు
కాగా విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ వచ్చిందని ప్రచార జరిగిన వ్యక్తికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని ప్రజలెవరూ భయపడవద్దని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి చెప్పారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తి హోం క్వారంటైన్ లో ఐసోలేషన్ లో ఉన్నాడని అతనికి నెగెటివ్ వచ్చిందని ఆమె చెప్పారు.
అతడితో కాంటాక్ట్ అయిన 40 మందికి కూడా పరీక్షలు నిర్వహించామని అందరికీ నెగెటివ్ తేలిందని… రాష్ట్రంలో ఒమిక్రాన్ యాక్టివ్ కేసులు లేవని ఆమె వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ హైమవతి చెప్పారు.
12.12.21
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నిన్నటితో పొల్చితే స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 30,859 మంది సాంపిల్స్ ని పరీక్షించగా.. 160 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. కరోనాతో కృష్ణాలో ఒక్కరు మృతి చెందారు. అదే సమయంలో 201 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,74,868కి చేరింది. ఇందులో 20,58,490 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1912 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 14,466 మంది కరోనాతో మృతి చెందారు.
మరోవైపు ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుంచి ఏపీకి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి ఐర్లాండ్ నుంచి ముంబైకి చేరుకున్నాడని, అక్కడ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నాడని అధికారులు ప్రకటనలో తెలిపారు. అయితే ఆ సమయంలో ఆయనకు నెగిటివ్ అని తేలిందని, విజయనగరంలో మరోసారి కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని వివరించారు. అతడి శాంపిళ్లను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు.
11.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 31,131 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 188 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,954 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
10.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 32,793 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న చిత్తూరులో ఒకరు, కృష్ణాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 188 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,989 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
09.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 31,101 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 193 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 164 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,037 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
08.12.21
AP Corona Updates: రాష్ట్రంలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. గత 24 గంటల్లో 31,957 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 181 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,011 యాక్టివ్ కేసులున్నాయి.
07.12.21
06.12.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 18,788 పరీక్షలు నిర్వహించగా.. 122 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,453కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 213 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,57,369 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 2,030 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Thanks for reading Today AP:Covid-19 Media bulletin
No comments:
Post a Comment