10Th Class Jobs : పదో తరగతి పాస్ అయ్యారా .. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీ కోసమే ..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) వివిధ డిపార్ట్మెంట్లలో 322 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ (General Duty), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ (Yantrik) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు(Applications) ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. అభ్యర్థులు https://cgept.cdac.in/icgreg/candidate/login వెబ్సైట్ ద్వారా జనవరి 14లోపు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 22 ఏళ్ల వయసు గల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఇండియన్ కాస్ట్ గార్డ్(Indian Coast Guard) నావిక్ రిక్రూట్‌మెంట్(Recruitment) పరీక్షను నాలుగు దశల్లో నిర్వహిస్తారు. స్టేజ్ 1లో ఐదు వేర్వేరు పేపర్లు ఉంటాయి.
ఈ పేపర్‌లోని ప్రశ్నలు 10వ తరగతి గణితం, సైన్స్, జీకే, ఇంగ్లీష్(English), రీజనింగ్ నుంచి ప్రశ్నలొస్తాయి. నావిక్ (GD) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పేపర్ 2కు కూడా హాజరవ్వాలి. ఇక, యాంత్రిక్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్ సిలబస్ ఆధారంగా పేపర్ III/IV/V పరీక్షలను కూడా రాయాల్సి ఉంటుంది. అభ్యర్థుల ప్రిపరేషన్లో ఉపయోగపడే పుస్తకాల గురించి తెలుసుకుందాం.
ప్రిపరేషన్లో ఉపయోగపడే పుస్తకాలు..
ఎన్సీఈఆర్టీ పదో తరగతి గణితం పాఠ్య పుస్తకం, సైన్స్ పాఠ్యపుస్తకం, గణితం పాఠ్య పుస్తకం, సైన్స్ పాఠ్య పుస్తకం, అరిహంత్ పబ్లికేషన్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ (GD) గైడ్, అరిహంత్ పబ్లికేషన్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ (జీబీ/ డీబీ/ యాంత్రిక్) పుస్తకం, దిశా పబ్లికేషన్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ జనరల్ డ్యూటీ & డొమెస్టిక్ బ్రాంచ్ పరీక్షల కోసం స్టడీ గైడ్, ఆర్. గుప్తా ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ గైడ్, ఆర్. గుప్తా ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పుస్తకాలు ప్రిపరేషన్లో ఉపయోగపడతాయి. వీటితో పాటు ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను అధ్యయనం చేయాలి.
పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
అభ్యర్థులకు ముందు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను స్టేజ్ 2కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ IIను క్లియర్ చేసిన అభ్యర్థులు స్టేజ్ III నిర్వహిస్తారు. ఇందులో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, INS చిల్కాలో మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. దీనిలోనూ షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను స్టేజ్ IVకు ఎంపిక చేస్తారు. స్టేజ్ III, IV ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫలితాలు ఆగస్టులో ప్రకటిస్తారు.
Thanks for reading 10Th Class Jobs: Have you passed 10th class .. These Central Government jobs are for you ..
No comments:
Post a Comment