Cloth Mask : క్లాత్ మాస్క్ ధరిస్తున్నారా .. ! వైరస్ సోకే ప్రమాదం మీకు ఎంత ఉందంటే
వేగవంతమైన ఒమిక్రాన్పై వీటి ప్రభావం తక్కువే అంటోన్న నిపుణులు..
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సిన్లతో పాటు మాస్క్లు , భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అటు ప్రభుత్వాలు .. ఇటు శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు .
నిజానికి వైరస్ నుంచి రక్షణలో మాస్క్లు అత్యంత కీలకం అయినప్పటికీ .. ప్రస్తుతం ఇవి కూడా ఫ్యాషన్ను ఒంటబట్టించుకున్నాయి . దీంతో రంగురంగుల , తిరిగి ఉపయోగించే క్లాత్ మాస్క్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి . మరి వీటిని ఉపయోగించడం ఎంతవరకూ ప్రయోజనకరం అంటే .. పెద్దగా ఉపయోగం లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు .
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా సింగిల్ లేయర్ మాస్క్ లను వాడకపోవడమే మేలని చెబుతున్నారు . వీటి వల్ల కేవలం 20 నిమిషాల్లోనే వైరస్ సోకే ప్రమాదం ఉందని . హెచ్చరిస్తున్నారు . మాస్క్ ల వినియోగంపై అమెరికన్ కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఇండస్ట్రియల్ హైజీనిట్స్తో పాటు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( సీడీసీ ) పలు అధ్యయనాలు జరిపింది .
వీటి ప్రకారం ..
★ఒకవేళ ఇద్దరు వ్యక్తులు మాస్క్ లు ధరించకుండా ఆరు అడుగుల దూరంలో నిలబడితే .. అందులో వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ ఉంటే .. అప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ సోకుతుంది .
★ ఒకవేళ ఇద్దరిలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మాస్క్ లేకుండా .. అవతలి వ్యక్తి క్లాత్ మాస్క్ ధరించినట్లయితే .. అప్పుడు వైరస్ 20 నిమిషాల్లో సోకుతుంది .
★ఇక , ఇద్దరూ క్లాత్ మాస్క్ లు ధరిస్తే గనుక .. 27 నిమిషాల్లో వైరస్ వ్యాపిస్తుంది .
★ ఒకవేళ ఇద్దరిలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మాస్క్ లేకుండా .. అవతలి వ్యక్తి కేవలం సర్జికల్ మాస్క్ ధరించినట్లయితే .. అప్పుడు వైరస్ 30 | నిమిషాల్లో మరో వ్యక్తికి సోకుతుంది .
★ అదే ఇద్దరిలో ఒకరు ఎన్ 95 మాస్క్ ధరించి .. మరో వ్యక్తి పూర్తిగా మాస్క్ పెట్టుకోకపోతే కనీసం 2.5 గంటల్లో వైరస్ వ్యాపిస్తుంది .
★ ఇద్దరూ ఎన్ 5 మాస్క్లలు ధరిస్తే .. వైరస్ వ్యాప్తి చెందడానికి కనీసం 25 గంటల సమయం పడుతుందని అధ్యయనంలో తేలింది .
రెండు మాస్క్ లు మేలు ..
ఒక్కటే పొర ( సింగిల్ లేయర్ ) ఉన్న క్లాత్ మాస్క్ లు వైరస్లను మోసుకెళ్లే పెద్ద పెద్ద తుంపరలను అడ్డుకోగలవుగానీ , చిన్న చిన్న ఏరోసెల్స్ను బ్లాక్ చేయడంలో సమర్థంగా పనిచేయవని అధ్యయనం తెలిపింది . అయితే ధ్రువీకరించిన ఎన్ 95 మాస్క్లు మాత్రం గాలిలోని 95 శాతం అణువులను వడబోయగలవని పేర్కొంది . కానీ , చాలా మంది ఫ్యాషన్ కోసమో లేదా తిరిగి వినియోగించే వీలు ఉంటుందనో క్లాత్ మాస్క్లను వినియోగిస్తుంటారు .
అలాంటప్పుడు వాటిని సర్జికల్ మాస్క్ లతో కలిపి ధరిస్తే అలాంటప్పుడు వాటిని సర్జికల్ మాస్క్ లతో కలిపి ధరిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు . అంతేగానీ , ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోన్న ఈ సమయంలో కేవలం క్లాత్ మాస్క్ లేదా సర్జికల్ మాస్క్ ఒకటే పెట్టుకుంటే ప్రయోజనం ఉండదని చెబుతున్నారు . అయితే కొంతమంది నిబంధనల కోసం మాస్క్లు ధరిస్తున్నప్పటికీ వాటిని గడ్డం కిందకు వేలాడేస్తున్నారు . అలాంటప్పుడు ఏ రకం మాస్క్ అయితే కొంతమంది నిబంధనల కోసం మాస్ లు ధరిస్తున్నప్పటికీ వాటిని గడ్డం కిందకు వేలాడేస్తున్నారు . అలాంటప్పుడు ఏ రకం మాస్క్ పెట్టుకున్నా ప్రయోజనం శూన్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు . మనం ధరించే మాస్క్ తప్పకుండా ముక్కు , నోటిని పూర్తిగా కప్పి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు .
Thanks for reading Cloth Mask: Are you wearing a cloth mask ..!
No comments:
Post a Comment