Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, January 28, 2022

Jobs in postal department


 

Postal Recruitment 2022 : ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్ట‌ల్ ఉద్యోగాలు.. జీతం రూ.63,000 పైనే

Post Office Jobs 2022: టెన్త్ అర్హతతో పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు. రూ.63,200 వేతనం.

India Post Recruitment 2022

India Post Recruitment 2022 ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్ మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. టెన్త్ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోగలరు.

ఇండియా పోస్ట్ (India Post) వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తున్నాయి. కేంద్ర సమాచార, ఐటీ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (Department of Posts) న్యూ ఢిల్లీలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్ ఫామ్స్ స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. టెన్త్ పాస్ కావడంతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన డ్రైవింగ్ అర్హతలు కూడా అభ్యర్థులకు ఉండాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోగలరు.


India Post Recruitment 2022: ఖాళీల వివరాలు.

మొత్తం ఖాళీలు 29

అన్‌రిజర్వ్‌డ్ 15

ఎస్‌సీ 03

ఓబీసీ 08

ఈడబ్ల్యూఎస్ 03

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 21.01.2022

దరఖాస్తుకు చివరి తేదీ- 15.03.2022

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

అనుభవం- డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయస్సు- 27 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- టెస్ట్, స్కిల్ టెస్ట్

వేతనం- అభ్యర్థులకు ఏడో పే కమిషన్ పే మ్యాట్రిక్స్‌లో లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్- The Senior Manager , Mail Motor Service, C-121,Naraina Industrial Area phase-I, Naraina, New Delhi -110028.

India Post Recruitment 2022: అప్లై చేయు విధానం.

Step 1- అభ్యర్థులు 

https://www.indiapost.gov.in/

 వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- Recruitment సెక్షన్‌లో 

Staff Car Driver (Ordinary Grade) నోటిఫికేషన్

 క్లిక్ చేయాలి.

Step 3- 

దరఖాస్తు ఫోరమ్  నోటిఫికేషన్‌లో ఉంటుంది.

Step 4- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.

Step 5- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

Step 6- దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. కొరియర్ ద్వారా పంపే దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకోరు.

దరఖాస్తు ఫామ్ CLICK HERE


నోటిఫికేషన్ CLICK HERE

Thanks for reading Jobs in postal department

No comments:

Post a Comment