Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, February 21, 2022

Bank of Baroda Recruitment 2022


 Bank of Baroda Recruitment 2022

బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. డిగ్రీ పాసైన వారికి జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి.

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) నుంచి పలు ఖాళీల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఇటీవల ప్రముఖ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Bank Jobs) విడుదల అవుతున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (BOB Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్, బిజినెస్ కరస్పాండెంట్, సూపర్ వైజర్, సీనియర్ మేనేజర్, ఫ్యాకల్టీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నల్ అంబుడ్స్‌మన్, ప్రొడక్ట్ హెడ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

పోస్ట్ ఖాళీలు

ప్రొడక్ట్ హెడ్ 1

అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 3

సీనియర్ మేనేజర్ 3

మేనేజర్ 3

మొత్తం: 10

విద్యార్హతలు: ప్రొడక్ట్ హెడ్ విభాగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు డిగ్రీ చేసి ఉండాలి. మేనేజ్మెంట్ కోర్సుల్లో ఫుల్ టైమ్ డిగ్రీ, డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, మేనేజర్ తదితర ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారు డిగ్రీ చేసి ఉండాలి. బీఈ, బీటెక్, ఎంసీఏ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.


ఎలా అప్లై చేయాలంటే..


Step 1: అభ్యర్థులు మొదటగా https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.


Step 2: అనంతరం కెరీర్(https://www.bankofbaroda.in/career) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


Step 3: అనంతరం Current Opportunities (https://www.bankofbaroda.in/career/current-opportunities) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


Step 4: అక్కడ కావాల్సిన పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ కింద Apply Know ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


Step 5: కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.

Thanks for reading Bank of Baroda Recruitment 2022

No comments:

Post a Comment