ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ సిప్స్ , ప్రతి ఏటా 20 % వరకు రిటర్న్స్
మార్కెట్ అస్థిరతకు సంబంధించిన ఎక్కువ ఆందోళన లేకుండా, కాస్త తక్కువ రిస్క్ కలిగిన సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఎక్కువ మంది పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారుతోంది.
ఇన్వెస్టర్లు ప్రతి నెల రూ.500 నుండి రూ.1000 అంతకంటే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి సిప్ మంచి మార్గం. ఇది సాలిడ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌పోలియో నిర్మాణానికి ఉపకరిస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఉన్న మంచి ప్రయోజనం ఏమంటే తక్కువ మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అంటే నెలకు రూ.2000 ఇన్వెస్ట్ చేస్తే.. వీటిలో ఎలా ఉంటుందంటే...
లార్జ్ క్యాప్ ఫండ్స్
లార్జ్ క్యాప్ ఫండ్స్ విషయానికి వస్తే ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్, రిలయన్స్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉన్నాయి.
- ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్ 14 ఫిబ్రవరి 2006న లాంచ్ చేశారు. హైరిస్క్ అయినప్పటికీ ఇది లాంచ్ అయినప్పటి నుండి ప్రతి సంవత్సరం 11.69 శాతం రిటర్న్స్ ఇచ్చింది. పెట్టుబడి హోల్డింగ్స్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ 34.3 శాతం, ఆటోమొబైల్స్ 11.2 శాతం, కన్స్యూమర్ గూడ్స్ 9.9 శాతం.
- రిలయన్స్ లార్జ్ క్యాప్ ఫండ్ 8 ఆగస్ట్ 2007లో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైనప్పటి నుండి 11.89 శాతం రిటర్న్స్ ఇచ్చింది. పెట్టుబడి హోల్డింగ్స్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ 32.3 శాతం, ఎనర్జీ 10.3 శాతం.
మిడ్ క్యాప్ ఫండ్
మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మిడ్ సైజ్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ క్యాప్ పరంగా 100 స్థానం నుండి 250 స్థానాల వరకు ఉన్న కంపెనీలు. ఇందులో ఎల్ అండ్ టీ మిడ్ క్యాప్ ఫండ్.
- ఎల్ అండ్ టీ 9 ఆగస్ట్ 2004లో ప్రారంభమైంది. ఇది లాంచ్ అయినప్పటి నుండి 21.75 శాతం లాభాలను అందించింది.
పెట్టుబడి హోల్డింగ్స్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ 18.5 శాతం, కన్‌స్ట్రక్షన్ 13.5 శాతం, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ 12.5 శాతం.
స్మాల్ క్యాప్ ఫండ్
మ్యూచువల్ ఫండ్ కంపెనీలు స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి.
- HDFC స్మాల్ క్యాప్ ఫండ్ 3 ఏప్రిల్ 2008లో ప్రారంభమైంది. హైరిస్క్ అయినప్పటికీ ఇది ప్రారంభమైనప్పటి నుండి 16.60 శాతం రిటర్న్స్ ఇచ్చింది. పెట్టుబడి హోల్డింగ్స్ విషయానికి వస్తే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ 16.8 శాతం, ఆటోమొబైల్ 16.5 శాతం, కన్స్ట్రక్షన్ 11.5 శాతంగా ఉంది.
- ఎల్ అండ్ టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ 12 మే 2014లో ప్రారంభమైంది. ఇది లాంచ్ అయినప్పటి నుండి 30.98 శాతం రిటర్న్స్ ఇచ్చింది. పెట్టుబడి హోల్డింగ్స్ విషయానికి వస్తే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ 21.9 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 14.9 శాతం, కన్స్యూమర్ గూడ్స్ 10 శాతం.
మల్టీ క్యాప్ ఫండ్స్
మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే పెట్టుబడులను డైవర్సిఫై చేసి, రిస్క్‌ను కాస్త తగ్గిస్తుంది.
- డీఎస్పీ బ్లాక్ రాక్ ఆపర్చునిటీస్ ఫండ్ 16 మే 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది హై రిస్క్ అయితే, లాంచ్ అయినప్పటి నుండి 18.91 శాతం రిటర్న్స్ ఇచ్చింది. పెట్టుబడి హోల్డింగ్స్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ 30.8 శాతం, ఎనర్జీ 11.3 శాతం, కన్‌స్ట్రక్షన్ 9.9 శాతం.
ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్
పన్ను మినహాయింపు వెసులుబాటు కల్పించే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఈఎల్ఎస్ఎస్.
- ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96.... 6 మార్చి 2008లో ప్రారంభమైంది. హైరిస్క్ అయినప్పటికీ ఇది లాంచ్ అయినప్పటి నుండి ప్రతి ఏటా 25.65 శాతం రిటర్న్స్ ఇచ్చింది. పెట్టుబడి హోల్డింగ్స్ విషయానికి వస్తే కన్స్యూమర్ గూడ్స్ 19.6 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 17.3 శాతం, ఆటోమొబైల్స్ 14.9 శాతం.
సెక్టార్ ఫండ్
మ్యూచువల్ ఫండ్స్ రంగాలవారీగా ఇన్వెస్ట్ చేస్తాయి.
యూటీఐ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్ ఫండ్ 9 మార్చి 2004లో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైనప్పటి నుండి 19.77 శాతం రిటర్న్స్ ఇచ్చింది. పెట్టుబడి హోల్డింగ్స్ విషయానికి వస్తే ఆటోమొబైల్ 77.8 శాతం, సర్వీసెస్ 13.6 శాతం, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ 6.9 శాతం.
బ్యాలెన్స్డ్ ఫండ్
డెట్, ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి.
రిలయన్స్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్-బ్యాలెన్స్డ్ 8 జూన్ 2005లో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైనప్పటి నుండి 14.37 శాతం రిటర్న్స్ ఇచ్చింది. పెట్టుబడి హోల్డింగ్స్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ 41.8 శాతం, ఎనర్జీ 10.8 శాతం.
Thanks for reading Best Sips to Invest, Returns up to 20% per annum
No comments:
Post a Comment