SBI Recruitment 2022 : నిరుద్యోగులకు అలర్ట్ .. డిగ్రీ అర్హతతో SBI లో జాబ్స్ .. ఇలా అప్లై చేయండి
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India)లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగాల కంటే కూడా ఎక్కువ పోటీ ఉంటుంది. ఈ బ్యాంక్ లో ఉద్యోగాన్ని(Bank Jobs) చాలా సెక్యూర్ గా భావిస్తారు నిరుద్యోగులు.
తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (SBI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 48 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 2న ప్రారంభం కాగా.. దరఖాస్తుకు ఫిబ్రవరి 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 30న ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యార్హతల వివరాలు: నెట్వర్క్ సెక్యూరిటీ, రూటింగ్ అండ్ స్విచింగ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్త అర్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు ఆగస్టు 31 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి.
ఎలా ఎంపిక చేస్తారంటే..
ప్రొవిజనల్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రాత పరీక్షకు 75 శాతం మార్కులు, ఇంటర్వ్యూకు మరో 25 శాతం మార్కులు మొత్తం 100 మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి రూ. 36 వేల నుంచి రూ. 63840 వరకు వేతనం ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.
అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://bank.sbi/web/careers ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Latest Announcements విభాగంలో ADVERTISEMENT No. CRPD/SCO/2021-22/26 నోటిఫికేషన్ కింద Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం Click here for New Registration ఆప్షన్ పై క్లిక్ చేసి కావాల్సిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 4: అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ తో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.
Step 5: అప్లికేషన్ ఫామ్ ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
Thanks for reading SBI Recruitment 2022: Alert for the unemployed .. Jobs in SBI with degree qualification .. Apply Like
No comments:
Post a Comment