CoWIN : 12-14 ఏళ్ల వారికి కరోనా టీకా .. కొవిన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండిలా ..
కేంద్రం మార్చి 16 నుంచి కరోనా టీకా కార్యక్రమంలో మరో దశను ప్రారంభించనుంది. 12 నుంచి 14 ఏళ్ల వయస్సున్న పిల్లలకు టీకా ఇవ్వనుంది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను ఈ వయస్సు వారికి అందించనుంది. ఈ టీకా పంపిణీ ప్రక్రియలో భాగంగా.. 12 ఏళ్లు పైబడినవారు రేపటి నుంచి కొవిన్ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.
1. అందుకోసం www.cowin.gov.in లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి . తర్వాత అందులో Register Yourself అనే బటన్ ఉంటుంది . దాన్ని క్లిక్ చేసి మొబైల్ నంబరు రాస్తే ఫోన్లకు ఒక ఓటీపీ వస్తుంది .
2. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్తుంది . అక్కడ మీ పేరు , వయసు , పుట్టినతేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి . దీంతో పాటు ఏదో ఒక ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేయాలి . ఆధార్ కార్డులు అందుబాటులోని పక్షంలో పిల్లలు తమ విద్యార్థి ఐడీ కార్డులను ఉపయోగించవచ్చు .
3. పిల్లలు వారి కుటుంబ సభ్యులతో లేదా విడిగా సమోదు చేసుకోవచ్చు . ఒక కుటుంబంలోని నలుగురు సభ్యులు ఒక మొబైల్ నంబర్ సమోదు ప్రక్రియను పూర్తి చేయవచ్చు .
4. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ అకౌంట్ తర్వాత టీకా వివరాలు కనిపిస్తాయి . కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి . ' Schedule appointineni ' అని బటన్ క్లిక్ చేస్తే అపాయింట్మెంట్ పేజీకి వెళ్తుంది . అక్కడ రాష్ట్రం , జిల్లా , పిన్ కోడ్ ఎంటర్ చేసి మీ సమీపంలోని టీకా పంపిణీ కేంద్రాలను తెలుసుకోవచ్చు . ఆ జాబితా నుంచి ఒక కేంద్రాన్ని ఎంచుకుంటే అందుబాటులో ఉన్న స్లాట్స్ చూపిస్తుంది . వాటిలో నుంచి సమయం , తేదీని ఎంచుకుని కింద ఉండే Book బటన నన్ను క్లిక్ చేస్తే అపాయింట్మెంట్ లభిస్తుంది .
Thanks for reading CoWIN: Corona vaccine for 12-14 year olds .. Register in Cowin ..
No comments:
Post a Comment