Google Account : మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందా ? సింపుల్గా తెలుసుకోవచ్చు ఇలా
డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత అనేక రిస్కులు ఉంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ (Android Smartphone) ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇప్పుడు గూగుల్ అకౌంట్ (Google Account) తప్పనిసరిగా కావాల్సిందే.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ వాడాలంటే గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ కావాలి. ఈ యాక్సెస్ కావాలంటే గూగుల్ అకౌంట్ ఉండాలి. గూగుల్ అకౌంట్‌లో జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్, యూట్యూబ్ లాంటి అనేక గూగుల్ సేవలు పొందొచ్చు. అంతేకాదు... ఈ అకౌంట్‌తో ఇతర సైట్లలో లాగిన్ కూడా కావొచ్చు. ఇలా ప్రతీ చోటా గూగుల్ అకౌంట్ వాడుతుంటారు కాబట్టి రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. గూగుల్ అకౌంట్ హ్యాక్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. మరి మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందా? హ్యాక్ అయిన విషయం ఎలా తెలుసుకోవచ్చు? ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ అకౌంట్ హ్యాక్ అయిందో లేదో తెలుస్తుంది.
గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోండి ఇలా
Step 1- ముందుగా మీ గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అవండి.
Step 2- ఎడమవైపు ఉన్న ఆప్షన్స్‌లో Security ఆప్షన్ సెలక్ట్ చేయండి.
Step 3- Review security events పైన క్లిక్ చేయండి.
Step 4- మీ గూగుల్ అకౌంట్ ఎక్కడెక్కడ ఉపయోగించారో వివరాలు కనిపిస్తాయి.
Step 5- ఆ వివరాలన్నీ చెక్ చేయండి. మీరే ఆ యాక్టివిటీస్ చేశారో లేదో పరిశీలించండి.
Step 6- ఏదైనా అనుమానం ఉంటే No, it wasn't me అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
Step 7- మీ ప్రమేయం లేకుండా మీ గూగుల్ అకౌంట్ వాడినట్టు కనిపిస్తే మీ అకౌంట్ హ్యాక్ అయినట్టే
మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లాంటి వివరాలు ఇతరులకు తెలిస్తే మీ అకౌంట్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా రిస్క్. అందుకే మీ గూగుల్ అకౌంట్‌ను సెక్యూర్ చేసుకోవాలి. ఎలాగో ఈ కింది స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.
Step 1- ముందుగా మీ గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అవండి.
Step 2- ఎడమవైపు ఉన్న ఆప్షన్స్‌లో Security ఆప్షన్ సెలక్ట్ చేయండి.
Step 3- ఆ తర్వాత Your devices panel సెక్షన్‌లో Manage devices పైన క్లిక్ చేయండి.
Step 4- మీ గూగుల్ అకౌంట్ ఏ డివైజ్‌లల్లో లాగిన్ అయిందో తెలుస్తుంది.
Step 5- మీరు ఉపయోగించని డివైజ్‌లో గూగుల్ అకౌంట్ లాగిన్ అయినట్టైతే దాని పక్కన More details పైన క్లిక్ చేయండి.
Step 6- ఆ తర్వాత Don't recognise this device? ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆ తర్వాతి స్టెప్స్ ఫాలో అయి ఆ డివైజ్ నుంచి మీ అకౌంట్ లాగౌట్ చేయండి.
ఇలా మీరు నెలకోసారి అయినా మీ గూగుల్ అకౌంట్ చెక్ చేస్తూ ఉండాలి. అనుమానాస్పదంగా యాక్టివిటీస్ కనిపిస్తే అప్రమత్తం కావాలి. మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ కాకుండా ఉండేందుకు తరచూ మీ పాస్‌వర్డ్ మారుస్తూ ఉండాలి.
Thanks for reading Google Account: Has your Google Account been hacked? Here is how to find out
No comments:
Post a Comment