IPL 2022 : ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే
IPL 2022: ఐపీఎల్ 2022 షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 26న మొదలై మే 29న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై, కోలకతా జట్లు పోటీ పడననున్నాయి.
IPL 2022: క్రికెట్ అభిమానులు ఎంతగానో వేచిచూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 26న ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. మే 29న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగియనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో కోలకతా నైట్ రైడర్స్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈసారి లఖ్‌నవూ, గుజరాత్ జట్ల రాకతో పది జట్లు కప్పుకోసం పోటీ పడనున్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది.
రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవే కాకుండా ఫైనల్‌తో కలిపి నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఉంటాయి.
TATA_IPL_2022-Match_Schedule ..... Here
Thanks for reading IPL 2022: This is the full schedule of IPL
No comments:
Post a Comment