JEE Main 2022 : ఈసారి రెండు విడతల్లోనే జేఈఈ మెయిన్ .. షెడ్యూల్ వచ్చేసింది !
దిల్లీ: దేశంలోని ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అర్హుల్ని నిర్ణయించేందుకు ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.
జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) మంగళవారం సాయంత్రం ఈ షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్టు స్పష్టంచేసింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్; మే 24 నుంచి 29 వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎన్‌టీఏ సీనియర్ డైరెక్టర్ (పరీక్షలు) డా. సాధనా పరాషర్ వెల్లడించారు. విద్యార్థులు మార్చి 1 నుంచి 31వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష గురువారమే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఈ పరీక్ష నిర్వహిస్తున్న బాంబే ఐఐటీ గురువారం సమగ్ర వివరాలతో బ్రోచర్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించే విద్యార్థులు జూన్ 8 నుంచి జూన్ 14 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఫలితాలను జులై 18న వెల్లడించగా.. ఆ మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్ మొదలవుతుందని వివరించింది.
Thanks for reading JEE Main 2022 Schedule
No comments:
Post a Comment